వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దిగ్విజయ్ సింగ్ అండ: మళ్లీ రాజ్యసభకు కెవిపి

By Pratap
|
Google Oneindia TeluguNews

KVP Ramachandar Rao
హైదరాబాద్: కాంగ్రెసు తరఫున కెవిపి రామచంద్రరావు మరోసారి రాజ్యసభకు నామినేట్ అయ్యే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది. కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ ఆశీస్సులు ఉండడం ఆయనకు కలిసి వస్తోందని అంటున్నారు. ముఖ్యమంత్రిగా వైయస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు ఆయనకు ముఖ్య సలహాదారుడిగా ఉన్న కెవిపి రామచంద్రరావు ఓ దశలో రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీలో చక్రం తిప్పారు.

కెవిపి ఆశీస్సులు ఉంటే సిఎం వైయస్ రాజశేఖర రెడ్డి మద్దతు ఉన్నట్లేనని భావించేవారు. వైయస్ రాజశేఖర రెడ్డి రాజకీయ వ్యవహారాలన్నీ ఢిల్లీ స్థాయిలో కెవిపి రామ చంద్రరావు చక్కబెట్టేవారు.
సమయంలో దిగ్విజయ్‌సింగ్‌ నాడు కూడా కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌గా ఉండేవారు. ఈ సంబంధాలు కూడా కెవిపి రామచంద్ర రావుకు రాజ్యసభ సీటు మరోసారి కట్టబెట్టేందుకు దిగ్విజయ్‌సింగ్‌ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

పార్టీపై జగన్‌ ధిక్కార స్వరం వినిపించినప్పుడు వైయస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి దగ్గరగా ఉండే కెవిపి రామచంద్రరావు కాంగ్రెస్‌ నాయకత్వ పక్షాన నిలిచారు. దానివల్ల కూడా కెవిపి రామచంద్ర రావును మరో విడత రాజ్యసభ సభ్యుడిగా కొనసాగించే అవకాశాన్ని పార్టీ అధిష్టానం కల్పిస్తుందని అంటున్నారు. రాష్ట్ర విభజన నిర్ణయంతో సీమాంధ్రలో కాంగ్రెస్‌ గడ్డు పరిస్థితులను ఎదుర్కుంటోంది.

ఈ స్థితిలో సీమాంధ్రలో పార్టీని చక్కబెట్టేందుకు కెవిపి రామచంద్రరావు సహకారం అవసరమని భావి స్తున్న కాంగ్రెస్‌ నాయకత్వం ఆయనకు రాజ్యసభసీటు మరోసారి కేటాయించాలని యోచిస్తున్నట్లు సమాచారం. రాజ్యసభ సభ్యుడి హోదాలో సీమాంధ్రలో పార్టీ బలో పేతం కోసం పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని భావి స్తోంది. పార్టీ హైకమాండ్‌ పెట్టే అభ్యర్థిని ఓడించాలని సీమాంధ్ర కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కొందరు సమాలోచనలు చేస్తున్నట్లు చెబుతున్నారు.

అయితే కెవిపి రామ చంద్రరావును బరిలోకి దించితే ఆ ధిక్కార స్వరాలు సైతం దారిలోకి వస్తాయని కాంగ్రెస్‌ నాయకత్వం భావిస్తోంది. ఆయనను రాజ్యసభ ఎన్నికల బరిలోకి దించితే ధిక్కారస్వర ఎమ్మెల్యేలు సైతం ఆయనకు ఓటువేసి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గెలిచేందుకు దోహదపడతారని ఆ పార్టీ హైకమాండ్‌ భావిస్తున్నట్లు సమాచారం.

English summary

 It is said that KVP Ramachandar Rao may be nominated for Rajyasabha seat for second time with the support of Congress Andhra Pradesh affairs incharge Digvijay Singh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X