నన్ను రెండోవైపు చూడొద్దు: దిల్ రాజు
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై వరుసగా సినిమాలు నిర్మిస్తున్న 'దిల్' రాజు ఇటీవలి కాలంలో తరుచుగా నెగెటివ్ వార్తలతో మీడియాలోకి వస్తున్నారు. గతంలో తాను నిర్మించిన 'థాంక్యూ' చిత్రం విడుదల చేసుకునేందుకు 'కార్తికేయ2' చిత్రాన్ని వాయిదా వేయించినట్లుగా వార్తలు వచ్చాయి. ఆయనమీద ఆరోపణలు వచ్చాయి. ప్రెస్ మీట్ లో కథానాయకుడు నిఖిల్ కళ్లమ్మట నీరు పెట్టుకున్నారు. ఆ విషయం 'దిల్' రాజు ఇమేజ్ ను బాగా దెబ్బతీసింది.

రాజుకున్న అగ్గి
తాజాగా 'దిల్' రాజు నిర్మాణంలో 'వారిసు ' చిత్రం నిర్మితమవుతోంది. ప్రారంభంలో తెలుగు, తమిళం రెండు భాషల్లో తీస్తామని, రెండూ ఒకేసారి విడుదల చేస్తామని ప్రకటించారు. తీరా షూటింగ్ ప్రారంభమైన తర్వాత ఒక్క తమిళంలోనే తీస్తున్నామని, తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేస్తామన్నారు. కాకపోతే సినిమాను 2023 సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచే సినీ పరిశ్రమలో అగ్గి రాజుకుంది. అదే సంక్రాంతికి 'వీరసింహారెడ్డి', 'వాల్తేర్ వీరయ్య' చిత్రాలు విడుదల కాబోతున్నాయి.

దుమారం రేపిన ప్రకటన
ఇటీవలే నిర్మాతల మండలి పండగ రోజుల్లో మొదటి ప్రాధాన్యత తెలుగు చిత్రాలకేనని, థియేటర్లు మిగిలితే డబ్బింగ్ సినిమాలకు ఇవ్వాలని ప్రకటన ఇచ్చింది. ఇది తెలుగు, తమిళ పరిశ్రమల్లో తీవ్ర దుమారం రేపింది. తమిళ నిర్మాత, దర్శకులు ఈ నిర్ణయంపై మండిపడ్డారు. గతంలో ఇదే 'దిల్' రాజు డబ్బింగ్ సినిమాలకు పండగరోజుల్లో విడుదల చేయొద్దంటూ వ్యాఖ్యానించినవి ఇప్పుడు వైరలవుతున్నాయి. అప్పుడు ఒకలా మాట్లాడి ఇప్పుడు తాను డబ్బింగ్ సినిమా విడుదల చేయడానికి నైజంతోపాటు ఏపీలో కూడా పెద్దసంఖ్యలో థియేటర్లను బ్లాక్ చేశారు.

నాలో ఎవరికీ తెలియని రెండో కోణం ఉంది
'మసూద' సినిమా సక్సెస్ మీట్ లో 'దిల్' రాజు మాట్లాడుతూ త్వరలోనే 'వారసుడు ' విషయంలో ప్రెస్ మీట్ పెట్టబోతున్నట్లు ప్రకటించారు. అందరూ తనను తప్పుగా అర్థం చేసుకుంటున్నారని, తనలో రెండో కోణం ఉందని, అది ఎవరికీ తెలియదని వ్యాఖ్యానించారు. సినిమాలను తొక్కేస్తాడు 'దిల్' రాజు.. అంటూ రకరకాలుగా మాట్లాడుతుంటారు కానీ నాలో ఇంకో సైడ్ ఉంది. సినిమాను ప్రేమిస్తాను. మంచి కంటెంట్ తో సినిమాలు తీసేవాళ్ల కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధపడతాను. ఒక అద్భుతమైన సినిమాను తన తెలుగు ప్రేక్షులకు చూపిద్దామని 'లవ్ టుడే' డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నాను. దీనివల్ల నాకు రూపాయి కూడా లాభం రాదని, కానీ సినిమాపై ఉన్న ప్రేమతోనే ఇలా చేస్తున్నానన్నారు.












Click it and Unblock the Notifications