గుండెల్లో నిద్ర పోతాం : మోదీకి జగన్ ఊడిగం చేస్తున్నారు : రాష్ట్రపతికి డిమాండ్ల నివేదన..!
ఢిల్లీ లో ఏపి ప్రయోజనాలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ దీక్ష చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి తో సమావేశమయ్యారు. తనతో సహా 11 మంది బృందం తో రాష్ట్రపతి వద్దకు వెళ్లిన సీయం రాజ్యసభ లో ఇచ్చిన హామీలను అమలు చేసేలా చూడాలని కోరారు. ఆ తరువాత మాట్లాడిన సీయం ప్రధాని మోదీ..జగన్ పై విరు చుకుపడ్డారు.

మోదీకి జగన్ ఊడిగం చేస్తున్నారు..
ఏపి ప్రతిపక్ష నేత జగన్ ను మోదీ కాపాడుతున్నారని..అవినీతి అంతం చేస్తామని చెప్పిన మోదీ ఇప్పుడు వారిని రక్షిం చే పనితో పడ్డారి ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. జగన్ -మోదీ కలిసే ఉన్నారని చెప్పుకొచ్చారు. కేసుల మాఫీ కోసం జగన్ ప్రధాని మోదీ కి ఊడిగం చేస్తున్నారని..ఆయన మోదీ మోచేతి నీరు తాగినా తమకు అభ్యంతరం లే దని పేర్కొన్నారు. కేంద్రం పై అవిశ్వాసం పెట్టే సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాల్సి వస్తుందని తె లిసి ముందుగానే రాజీనామా చేసి వెళ్లిపోయారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో మోదీ-కేసీఆర్ నుండి డబ్బులు తీ సుకొని పంపిణీ చేసేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో జగన్ -బిజెపి కలిసి పోటీ చేయాలని సూచించారు. తాను జగన్ ను ఆహ్వానించలేదని.. క్షమాపణ చెప్పిన తాము చేసే పోరాటానికి మద్దతు ఇస్తే కలుపుకుపోతామని చెప్పుకొచ్చారు.
ఢిల్లీలో ధర్మ పోరాటం.. మోడీపై చంద్రబాబు యుద్ధం.. జాతీయ నేతల మద్దతు (ఫోటోలు)

మోదీ గుండెల్లో నిద్రపోతాం..
తాము ఏపి ప్రయోజనాల విషయంలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేసారు. ఏపి పై ప్రధాని మోదీ వివక్ష చూపిస్తున్నారని ఫైర్ అయ్యారు. మోదీ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని, మనోభావా లతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు. ఇది మంచిదికాదని, అందుకే ఇవాళ ఢిల్లీ నడివీధుల్లో ప్రజల తరఫున నిరసన తెలుపుతూ పాదయాత్ర చేస్తున్నామని అన్నారు. మరొక్కసారి మోదీకి హెచ్చరిస్తున్నానని అన్నారు. ఇప్పటికై నా ప్రధాని స్పందించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, గుర్తుపెట్టుకోవాలని చంద్రబాబు హెచ్చరించారు. ఏపి విషయంలో ఆటలు ఆడుకుంటే మోదీ గుండెల్లో నిద్ర పోతామని హెచ్చరించారు. తాను చేసిన దీక్షకు దేశ వ్యాప్తం గా మద్దతు వచ్చిందని..ఎన్నికల తరువాత ఏపికి హోదా ఇచ్చే ప్రభుత్వమే వస్తుందని చెప్పుకొచ్చారు.
18 డిమాండ్లతో వినతి పత్రం..
ఏపి భవన్ నుండి జంతర్ మంతర్ వరకు నిరసన ర్యాలీగా వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం ఆ తరువాత రాష్ట్రపతి భవన లో రాష్ట్రపతి కోవింద్ తో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి తో సహా 11 మందికి మాత్రమే అనుమతి ఉండటంతో వారు రాష్ట్రపతిని కలిసారు. ఈ సమయంలోనే 19 డిమాండ్ల తో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు.
రాష్ట్రంలో పరిస్థితులను ముఖ్యమంత్రి ఏకరువు పెట్టారు. విభజన తరువాత ఇటువంటి ఇబ్బందులు ఉంటాయని రాష్ట్రపతి అభిప్రాయపడినట్లు సమాచారం. కేంద్రం విఫలమైందని..రాష్ట్రపతి చొరవ తీసుకోవాలని సీయం కోరారు. రాష్ట్రపతి కూడా న్యాయం చేయకపోతే తాము కోర్టుల ద్వారా పోరాడుతామని..ప్రజా కోర్టులో బిజెపిని నిలబెడతామని చంద్రబాబు హెచ్చరించారు.












Click it and Unblock the Notifications