ఆ హీరోకు బలుపు... దర్శకుడి కామెంట్స్ వైరల్
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రతేక గుర్తింపును సొంతం చేసుకున్న దర్శకుల్లో ఏఎస్ రవికుమార్ చౌదరి ఒకరు. రాజ్ తరుణ్ హీరోగా తిరగబడరాసామి టైటిల్ తో ఒక సినిమాను తెరకెక్కించారు. ఇది త్వరలోనే విడుదల కానుంది. హీరోయిన్ మున్నారా చోప్రాను ముద్దు పెట్టుకోవడం ద్వారా రవికుమార్ చౌదరి వార్తల్లో నిలిచారనే సంగతి తెలిసిందే. తనపై వస్తున్న ట్రోలింగ్ కు ఆయన క్లారిటీ ఇచ్చారు.
తాజాగా రవికుమార్ చౌదరి హీరో గోపీచంద్ పై పరోక్షంగా విమర్శలు చేశారు. అవి వైరల్ గా మారాయి. గతంలో అందరం చెట్టుకింద కూర్చుని భోజనం చేసేవాళ్లమని, ఒకరోజు ఒక హీరో కోసం వెళ్తే కొంతసేపు వెయిట్ చేయమన్నాడంటూ గోపీచంద్ గురించి రవికుమార్ చౌదరి పరోక్షంగా కామెంట్లు చేశారు. "ఒరేయ్ అంత బలిసిందారా మీకు..? గతంలో నా కుటుంబంలో ఏ శుభకార్యం జరిగినా వచ్చావ్? ఇప్పుడు నీ దగ్గరికి నేను రావాలంటే ఐదుగురిని దాటుకుని రావాలా" అని ప్రశ్నించారు.

అప్పటివరకు వాడు విలన్ గా నటించేవాడని... వాడిని నేనే హీరోను చేశానని రవికుమార్ చౌదరి చెప్పారు. ఆ సినిమాకు తన రెమ్యునరేషన్ కంటే వాడి పారితోషికం తక్కువని తెలిపారు. వాడు ఇప్పుడు ఎదురుపడినా ఇలానే మాట్లాడతానని, రారాజు సినిమా షూటింగ్ జరుగుతుందని.. ఆ సమయంలో తాను అక్కడికి వెళ్లానన్నారు.ఆ సమయంలో తాను ఫ్లాప్ లో ఉండటంతో మరో సినిమా చేద్దామని అడిగినా దూరం పెట్టాడని, మంచి కథ సిద్ధం చేసి రండి చూద్దాం అంటూ అవమానించాడన్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో ఫైట్ మాస్టర్ విజయ్ కూడా ఉన్నాడని తెలిపారు. తాజాగా రవికుమార్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి












Click it and Unblock the Notifications