వైఎస్ వివేకా హత్యపై వైఎస్ షర్మిల: బీఎస్పీ ఎంపీ మర్డర్‌తో లింక్: కొత్తకోణం

అమరావతి: వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతంపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ప్రకంపనలు ఇంకా తగ్గట్లేదు. వివేకా ఆస్తులన్నీ ఆయన పేరు మీద లేవని, వాటిని ఎప్పుడో తన కుమార్తె సునీత పేరు మీదికి బదలాయించారని, ఈ మేరకు వీలునామా కూడా రాశారంటూ షర్మిల చెప్పడం- ఏపీలో రాజకీయాల్లో కలకలం రేపింది.

దీనిపై తాజాగా ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ స్పందించారు. షర్మిల చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఆమె ఇంత అపరిపక్వంగా మాట్లాడతారని అనుకోలేదని పేర్కొన్నారు. ఒక ఉన్నతమైన రాజకీయ కుటుంబానికి చెందిన మహిళ, ఒక పార్టీకి అధినాయకత్వాన్ని వహిస్తోన్న షర్మిల- వివేకా హత్య గురించి చేసిన వ్యాఖ్యలు ఆమె అపరిపక్వతకు అద్దంపడుతున్నాయని పేర్కొన్నారు. షర్మిల స్టేట్‌మెంట్ తనను ఆశ్చర్యానికి గురి చేసిందని అన్నారు.

 vivekargvsharmila

సునీత పేరు మీద ఆస్తులను బదలాయించినప్పుడు, వీలునామా కూడా సిద్ధం చేసినప్పుడు వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేయాల్సిన అవసరం ఆమెకు లేదంటూ షర్మిల చెప్పడం సరికాదని రామ్ గోపాల్ వర్మ అన్నారు. ఈ వీలునామాను రెండో భార్య షమీమ్‌ పేరు మీద దాన్ని బదలాయించడానికి వివేకాకు అవకాశం ఉంది కదా? అని గుర్తు చేశారు. షమీమ్‌ను పెళ్లి చేసుకోవడాన్ని సునీత ఇదివరకే వ్యతిరేకించిందని పేర్కొన్నారు.


తన పేరు మీద ఉన్న ఆస్తిపాస్తులన్నింటినీ వైఎస్ వివేకానందరెడ్డి తన రెండో భార్య పేరు మీద బదలాయించబోతోన్నట్లు సమాచారం అందడం వల్ల లేక అనుమానం రావడం వల్లనో ఇలా ఏదో ఒక కారణంతో సునీతే వైఎస్ వివేకాను ఏదో ఒకటి చేయడానికి కారణం ఉందని అంచనా వేస్తోన్నట్లు ఆర్జీవీ చెప్పారు. అది జరిగిందా? లేదా? అని తాను చెప్పట్లేదని, దాని గురించి తేల్చాల్సిందే దర్యాప్తు సంస్థలేనని అన్నారు.

ఓ కారణం మాత్రం సునీత వైపే ఉందని రామ్ గోపాల్ వర్మ అన్నారు. గతంలో బహుజన్ సమాజ్‌వాది పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యుడు దీపక్ భరద్వాజ్ హత్యోదంతం కూడా ఇలాంటిదేనని ఆయన గుర్తు చేశారు. ఆస్తి విషయంలో సొంత కొడుకే ఆయనను హతమార్చారని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన కథనంతో కూడిన ఓ ఇంగ్లీష్ వెబ్‌సైట్ లింక్‌ను ఆయన తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+