జై బోలో తెరాస: నల్లగొండ నుంచి పోటీకి శంకర్
చెన్నై: జై బోలో తెలంగాణ చిత్రం ద్వారా తెలంగాణలో విశేషమైన ఆదరణ పొందిన సినిమా దర్శకుడు శంకర్ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) వైపు చూస్తున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో నల్లగొండ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని ఆశగా ఉందని ఎన్. శంకర్ తెలిపారు.
ఆయన శుక్రవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. అయితే ఈ విషయంపై తాను తెరాస నేతలతో మాట్లాడలేదని చెప్పారు. అదే సమయంలో తెలంగాణ సినీ ఫోర్స్ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేయాలని తలపెట్టినట్లు కూడా ఆయన చెప్పారు.

తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కళాకారులను ప్రోత్సహించడమే ఈ పోర్స్ లక్ష్యమన్నారు. ఇందుకోసం అన్ని వర్గాల సహకారం తీసుకుంటామని తెలిపారు. రామ్, ఆయుధం, జయం మనదేరా వంటి చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు.
తెలంగాణకు చెందిన శంకర్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణలో ఆయన విశేషమైన ఆదరణ పొందారు.












Click it and Unblock the Notifications