బిజెపి,టిడిపి గుర్తింపును రద్దు చేయండి:ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
ఎన్నికల మేనిఫెస్టోలో ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేంద్రం, రాష్ట్రం విఫలమయ్యాయంటూ ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఏపీ కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అనంతరం ఆ రెండు పార్టీల గుర్తింపు రద్దు చేయాలని ఈసీని ఏపీ కాంగ్రెస్ నేతలు కోరారు.
ఈ సందర్భంగా ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి మీడియాతో మాట్లాడుతూ 15 ఏళ్లు ప్రత్యేక హోదా ఉండాలన్న టిడిపి-బిజెపి ఇప్పుడు మాట మార్చాయని మండిపడ్డారు. ఈ రెండు పార్టీలు విభజన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశాయని ఆరోపించారు.

అనంతరం మరో కాంగ్రెస్ నేత కెవిపి మాట్లాడుతూ మోడీకి ఏ మాత్రం నైతిక విలువలున్నా హోదా హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. టీడీపీ, బీజేపీ ఎప్పుడు కలిసుంటాయో ఎప్పుడు విడిపోతాయో చెప్పలేమని...ఈ రాజీనామా డ్రామాలు కొత్త కాదని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications