ఆదానీ వివాదం:జగన్ ఒప్పందాల పై తాజా నిర్ణయం - బిగ్ టర్న్..!!
ఆదానీ - జగన్ ముడుపుల ఆరోపణల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగన్ పైన ఆరోపణలు రావటంతో సెకీతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలనే డిమాండ్ తెర పైకి వచ్చింది. ఈ వివాదంలో అధికారుల నివేదిక మేరకు చర్యలు ఉంటాయని చంద్రబాబు స్పష్టం చేసారు. తన పైన వచ్చిన ఆరోపణలను జగన్ ఖండించారు. తక్కువ ధరకు సెకీ నుంచి ప్రతి పాదన రావటంతో ఒప్పందం చేసుకున్నామని.. అందులో ఆదానీ పాత్ర లేదని వెల్లడించారు. ఇప్పుడు ఈ ప్రతిపాదన పైన డిస్కం ల నుంచి ఏపీ ప్రభుత్వానికి కీలక సిఫార్సులు అందాయి.
జగన్ ఒప్పందాలపై
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సెకీ)తో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల పైన తాజాగా డిస్కమ్ లు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాయి. నాడు ఈ ఒప్పందాల వెనుక ఆదానీ అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ కు ముడుపు లు ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి. దీని పైన జగన్ లక్ష్యంగా కూటమి నేతలు విమర్శలు చేసారు. జగన్ తన ఒప్పందం వెనుక కారణాలను వివరించారు. తమకు కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీ నుంచి ప్రతిపాదన వచ్చిందని.. ఆ ప్రతిపాదన మేరకే తాము తక్కువ ధరకు సెకీతో ఒప్పందం చేసుకున్నామని వెల్లడించారు.

తాజా నివేదికలో
సెకీతో తాము చేసుకున్న ఒప్పందంలో ఆదానీ పాత్ర లేదని.. సెకీ కేంద్ర ప్రభుత్వ సంస్థగా ఏపీ ప్రభుత్వం అగ్రిమెంట్ కు వెళ్లిందని వివరించారు. ఆదానీ తనను అనేక అంశాల పైన కలిసారని.. ఒక సీఎంతో వ్యాపార ప్రముఖులు కలవటం అని చెప్పుకొచ్చారు. ఇక, నాటి సెకీతో ఏపీ ప్రభుత్వ ఒప్పందాలను రద్దు చేయాలంటూ ప్రభుత్వానికి డిమాండ్లు వచ్చాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వ్యవహారంలో ఏం చేయాలనే అంశంలో తర్జన భర్జన పడ్డారు. అధికారుల నివేదిక కోరారు. కాగా, తాజాగా డిస్కం లు ఈ అంశం పైన ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. సెకీతో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను కొనసాగించాలని డిస్కం లు ప్రభుత్వానికి నివేదించాయి.
డిస్కం ల సిఫార్సుతో
సెకీతో ఒప్పందాలను ఆపరాదని సూచించాయి. సెకీ నుంచి కొనుగోలు చేస్తున్న 7,000 మెగావాట్ల విద్యుత్తును రాజస్థాన్, గుజరాత్ విద్యుదుత్పత్తి సంస్థల నుంచి సేకరించనున్నట్టు స్పష్టం చేశాయి. 2021 డిసెంబరు 1న చేసుకున్న ఒప్పందం మేరకు ఈ ఏడాది 3,000 మెగావాట్లు, 2025లో మరో 3,000 మెగావాట్లు, 2026లో మిగిలిన 1000 మెగావాట్లను సరఫరా చేస్తామని పేర్కొందని తెలిపాయి. 2025-26కి గాను ఈఆర్‌సీకి సమర్పించిన వాస్తవాదాయ నివేదికలో డిస్కమ్‌లు ఈ మేరకు పేర్కొన్నాయి. ఇప్పుడు డిస్కం ల సిఫార్సు పైన ప్రభుత్వం తదుపరి చర్యలు ఏంటనేది ఆసక్తి కరంగా మారుతున్నాయి.












Click it and Unblock the Notifications