వైఎస్ జగన్ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ మరింత వెనక్కి: ఏడాది తరువాతే: జాప్యానికి కారణాలివే
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న ప్రాజెక్ట్.. కొత్త జిల్లాల ఏర్పాటు. ఈ ప్రక్రియ మరింత జాప్యం కానుంది. కనీసం ఇంకో ఏడాది తరువాతే రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాది జనవరిలో దీనిపై ఓ కీలక ప్రకటన వెలువడుతుందనే అంచనాలు వ్యక్తమౌతున్నాయి. ఈ ప్రక్రియ కనీసం పది నెలల పాటు వాయిదా పడొచ్చనే ప్రచారం ప్రస్తుతం సాగుతోంది. దీనికి ప్రధాన కారణం- జనాభా లెక్కలు..భూముల రీ సర్వే. ఈ రెండూ పూర్తయిన తరువాతే జిల్లాల పునర్విభజన ప్రక్రియను చేపట్టాలని జగన్ ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.

కమిటీ ఏర్పాటు చేసినా..
నిజానికి కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఈ జనవరి నాటికి పూర్తి కావచ్చంటూ ఇదివరకు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. ఈ ప్రక్రియను మరింత ముమ్మరం చేయడానికి ఇదివరకు ప్రభుత్వం ఓ కమిటీని కూడా నియమించింది. ఆ కమిటీ తన నివేదికను సైతం ప్రభుత్వానికి అందజేసింది. రాష్ట్రంలో కొత్తగా 27 జిల్లాలు ఏర్పడటానికి అవకాశాలు ఉన్నాయంటూ అప్పట్లో ఈ కమిటీ తన నివేదికలో స్పష్టం చేసినట్లు తేలింది. రాష్ట్రంలోని 25 లోక్‌సభ నియోజకవర్గాలను 25 జిల్లాలుగా మార్చడంతో పాటు కొత్తగా అరకు, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిని జిల్లాగా గుర్తిస్తారంటూ వార్తలొచ్చాయి.

కామా పడినట్టే..
ఈ ప్రక్రియకు ప్రభుత్వం కామా పెట్టిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. వచ్చే ఏడాది జనవరి నుంచి కొత్త జిల్లాలు మనుగడలోకి వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చని సమాచారం. ఈ ఏడాది చేపట్టనున్న జనాభా లెక్కలను పూర్తయిన తరువాతే దీనికి పూనుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు. జనగణన పూర్తయ్యే వరకూ జిల్లా, మండల, గ్రామ రెవెన్యూ పరిధిలో ఎలాంటి మార్పులు, చేర్పులు చేయవద్దని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఫలితంగా ఈ ప్రక్రియ ఇప్పట్లో పట్టాలెక్కకపోవచ్చని అంటున్నారు.

అన్నీ అడ్డంకులే..
రాష్ట్రంలో ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా మార్చుతామని, ఫలితంగా పరిపాలన వ్యవహారాలు మరింత సులభతరమౌతాయంటూ ఇదివరకు ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తరువాత ఆ ప్రక్రియను చేపట్టారు. కసరత్తు కూడా పూర్తి చేశారు. జిల్లాల పునర్విభజనకు సంబంధించి ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసింది సర్కార్. ఆ కమిటీ ప్రతిపాదిత నివేదికను కూడా రూపొందించింది. లోక్‌సభ నియోజవర్గాల ప్రాతిపదికగా జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని సూచించింది.

స్థానిక సంస్థల ఎన్నికలు మొదలుకుని..
రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో జిల్లాల ఏర్పాటునకు తొలిసారిగా ఆటంకం ఏర్పడింది. తాజాగా జనాభా లెక్కలు మరోసారి అడ్డంకిగా మారబోతోన్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ప్రతి పదేళ్లకోసారి చేపట్టాల్సిన జనగణన ప్రక్రియ నిలిచిపోయింది. ఈ ఏడాది మొత్తానికీ ఈ ప్రక్రియ చేపట్టకపోవచ్చని తెలుస్తోంది. రెవెన్యూ పరిధిలో మార్పులు, చేర్పులు చేయవద్దంటూ కేంద్రం ఆదేశాలను జారీ చేసిందనే విషయం విజయవాడకు చెందిన ఆర్టీఐ కార్యకర్త ఇనగంటి రవికుమార్ సమాచార హక్కు చట్టం కింద సేకరించిన వివరాల మేరకు వెలుగులోకి వచ్చింది.
-
జగన్ సీపీఆర్వో శ్రీహరి అరెస్ట్ కలకలం-హైకోర్టుకు వైసీపీ-డీజీపీకి ఘాటు లేఖ..! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!! -
మావిగన్ చర్చ వేళ సీఆర్డీఏ పరిధి పై కీలక నిర్ణయం- ఇక ఇలా..!! -
ఏపీ నూతన ఎన్నికల కమిషనర్ గా.. జగన్ బాధిత అధికారి..!? -
ఏపీలో కొత్త లోక్‌సభ నియోజకవర్గాలు..రిజర్వేషన్లు ఇలా - ఆ స్థానాల పునరుద్దరణ, ఇవి రద్దు..!! -
అమరావతిలో క్వాంటమ్ రిఫరెన్స్ కేంద్రాల ప్రారంభం-దేశంలోనే తొలిసారి..! -
అడ్డంగా దొరికిన చంద్రబాబు? అంకెలతో తేల్చేసిన సజ్జల ..! -
వీడ్ని నడిరోడ్డుపై ఉరి తీసినా తప్పులేదు.. 180 మంది బాలికలపై..!!












Click it and Unblock the Notifications