టీడీపీకి దివ్యవాణీ రాజీనామా- అఫీషియల్ : చంద్రబాబుతో భేటీ - ఆ వెంటనే..!!
టీడీపీలో ఇప్పుడు దివ్యవాణీ రాజీనామా వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. రెండు రోజుల క్రితం తాను టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లుగా ట్వీట్ చేసిన దివ్యవాణీ ఆ వెంటనే తూచ్ అన్నారు. తాను టీడీపీ వీడటం లేదని..అంతకు ముందు తనను సస్పెండ్ చేసినట్లు వచ్చిన నకిలీ పోస్టు చూసి పొరపడి ట్వీట్ పెట్టానని దివ్యవాణి తెలిపారు. తొలుత ట్వీట్ లో తెలుగుదేశం పార్టీలో కొన్ని దుష్ట శక్తుల ప్రమేయన్ని వ్యతిరేకిస్తూ పార్టీకీ రాజీనామా చేస్తున్నాను. ఇంతవరకు నన్ను ఆదరించిన ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను' అని ట్విట్టర్‌లో ఆమె రాసుకొచ్చారు.
రెండు రోజుల హై డ్రామా
ఆ తరువాత తాను టీడీపీలోనే కొనసాగుతున్నట్లుగా ప్రకటించారు. ఇక, బుధవారం టీడీపీ అధినేత చంద్రబాబును పార్టీ కార్యాలయంలో దివ్యవాణీ కలిసారు. మీడియాతో సంతోషంగా మాట్లాడారు. ఆ సమయంలోనే చంద్రబాబు చాలా మర్యాద ఇచ్చారంటూ సెటైరికల్ గా మాట్లాడారు. విశ్లేషణలు చేసిన వారందరికీ కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. రాజకీయం తెలియదని విమర్శించిన వారికీ కృతజ్ఞతలని దివ్యవాణి వ్యంగ్యాస్త్రం సంధించారు. ట్వీట్ ను డిలీట్ చేయటం.. చంద్రబాబును కలవటంతో ఇక దివ్యవాణి టీడీపీలోనే కొనసాగుతారని..ఈ వివాదం ముగిసినట్లేనని అందరూ భావించారు.

రాజీనామా ..తూచ్ అంటూ
కానీ, ఆ వెంటనే దివ్యవాణి ఒక వీడియో సందేశం విడుదల చేసారు. అందులో తాను టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తనకు పార్టీలో చాలా మర్యాద ఇచ్చారంటూ మరోసారి వ్యగంగా వ్యాఖ్యానించారు. అన్ని విషయాలను మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరిస్తానని చెప్పుకొచ్చారు. అయితే, దివ్యవాణి పార్టీలో పరిస్థితుల గురించి ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యల పైన పార్టీ అధినాయకత్వం ఆగ్రహంతో ఉందనే ప్రచారం సాగుతోంది. దీని పైన పార్టీ నాయకత్వం ప్రశ్నించిందని..దీంతో..దివ్యవాణీ మనస్థాపానికి గురైనట్లు చెబుతున్నారు. కొంత కాలంగా వైసీపీని..సీఎం జగన్ ను టార్గెట్ చేయటంతో దివ్యవాణీ పార్టీ వాయిస్ వినిపించటంలో దివ్యవాణీ ముందు వరుసలో ఉన్నారు.

టీడీపీ చీఫ్ తో బేటీ - రాజీనామా నిర్ణయం
అయితే, పార్టీ మహిళా విభాగం నిర్వహించిన కార్యక్రమాల పైన దివ్యవాణి వ్యాఖ్యలు చేసారని..వాటి పైన పార్టీ నాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేసిందని తెలుస్తోంది. అయితే, మహానాడు వేదికగా తనకు కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకపోవటం పైన దివ్యవాణి మనస్థాపానికి గురయ్యారని తెలుస్తోంది. రెండు రోజులుగా దివ్యవాణి రాజీనామా.. నిర్ణయంలో మార్పు..ఇప్పుడు అధికారికంగా రాజీనామా ..ఈ మొత్తం వ్యవహారం పైన దివ్యవాణి ఈ రోజు క్లారిటీ ఇవ్వనున్నారు.












Click it and Unblock the Notifications