Diwali 2023: దీపావళి తేదీపై సందిగ్ధత - పండితుల క్లారిటీ, సెలవు ఖరారు..!!
దీపావళి కి పండుగల్లో ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి సంవత్సరం ఈ పండగను కార్తీకమాసంలోని అమావాస్య రోజున జరుపుకుంటారు. ఈరోజు లక్ష్మీదేవి అమ్మవారిని పూజించడం వల్ల జీవితంలో ఆనందం, శ్రేయస్సు రెట్టింపు అవుతుందని భక్తుల నమ్మకం. అయితే ఈ సంవత్సరం దీపావళి తేదీల్లో మార్పులు రావడంతో తేదీల్లో గందరగోళం నెలకొంది. దీని పైన పండితులు స్పష్టత ఇస్తున్నారు. ప్రభుత్వం సెలవు పైన క్లారిటీ ఇచ్చింది.
అమావాస్య తిధి ఇలా
దీపావళి ప్రతి సంవత్సరం ఈ పండగను ఘనంగా ఐదు రోజుల పాటు జరుపుకుంటారు.ప్రతి సంవత్సరం దీపావళి పండుగను అమావాస్య తిథి రోజున జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరం నవంబర్ 12వ తేదీన అమావాస్య తిథి ప్రారంభం కాబోతోంది. ఈ తిథి మధ్యాహ్నం 2.40 గంటలకు ప్రారంభమై.. నవంబర్ 13వ తేదీ మధ్యాహ్నం 2.50 గంటలకు ముగుస్తుంది.

ఈరోజు ప్రత్యేక పూజలు చేయాలనుకునేవారు అమ్మవారికి ప్రదోషకాలంలో ఉపవాసాలు, పూజలు చేయడం శ్రేయస్కరమని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇదే సమయంలో లక్ష్మీదేవి పూజతో పాటు గణేశుడి పూజను కూడా చేయడం శుభప్రదంగా చెబుతున్నారు. నవంబర్ 12 సాయంత్రం 5:39 నుంచి 7:35 వరకు లక్ష్మీపూజకు అనువైన సమయం గా పేర్కొంటున్నారు.
అయిదు రోజుల పండుగ
ధంన్ తేరాస్ జరుపుకున్న మరుసటిరోజే ఈ నరక చతుర్దశి జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ సంవత్సరం నవంబర్ 11వ తేదీన నరక చతుర్దశిని జరుపుకోవాలని వేద జ్యోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. ధంన్ తేరాస్ జరుపుకున్న మరుసటిరోజే ఈ నరక చతుర్దశి జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ సంవత్సరం నవంబర్ 11వ తేదీన నరక చతుర్దశిని జరుపుకోవాలని వేద పండితులు చెబుతున్నారు.ప్రతి సంవత్సరం గోవర్ధన పూజను దీపావళి జరుపుకున్న తర్వాత మరుసటి రోజు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ పూజను కార్తీక మాసం రోజున జరుపుకోవాలని సూచిస్తున్నారు. తిథుల ప్రకారం నవంబర్ 14వ తేదీన గోవర్ధన జరుపుకోవాల్సి ఉంటుంది.
సెలవుల ప్రకటన
దసరా సెలవులు ముగియటంతో తెలుగు రాష్ట్రాల్లో విద్యా సంస్థలు తిరిగి ప్రారంభమయ్యాయి. దసరా సెలవుల విషయంలో అధికారికంగా ప్రకటించే సందర్భంగా చివరి నిమిషం వరకు ఊగిసలాట కనిపించింది. దీంతో, దీపావళి సెలవు పైన మాత్రం ఈ సారి ముందే స్పష్టత ఇచ్చారు. ఈ సారి నవంబర్ 12న (ఆదివారం) దీపావళి రావడంతో ఆ రోజునే ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు సెలవుగా ప్రకటించాయి. ఇక దీపావళి ఏ రోజు చేసుకోవాలి అనే విషయానికి వస్తే.. నవంబర్ 12వ తేదీ రాత్రి గడియల్లో అమావాస్య తిథి ఉండటంతో ఆ రోజునే దీపావళి పండుగ జరుపుపోవాలని పండితులు సూచిస్తున్నారు. దీంతో..మొత్తంగా ఈ సారి నవంబర్ 12వ తేదీనే దీపావళి జరుపుకొనేందుకు సిద్దం అవుతున్నారు.












Click it and Unblock the Notifications