వైయస్ బతికుంటే..: డిఎల్, జగన్‌పై బాలయ్య నిప్పులు
కడప/అనంతపురం: వైయస్ రాజశేఖర రెడ్డి బతికి ఉంటే ఆయన అమెరికా జైలులో ఉండేవారని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత డిఎల్ రవీంద్రా రెడ్డి మంగళవారం కడప జిల్లాలో అన్నారు. వైయస్ ఇప్పుడు సజీవంగా ఉంటే టైటానియం కుంభకోణం విషయంలో విదేశాల జైల్లో ఉండేవారన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓ బచ్చా అన్నారు. ప్రతి ఒక్కరు టిడిపికి ఓటు వేయాలని గ్రామస్థులను కోరారు.

అనంతలో బాలకృష్ణ
ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారి గొప్పతనాన్ని ఎన్టీఆర్, చంద్రబాబులు చాటితే.. కాంగ్రెసు పార్టీ మాత్రం అంతర్జాతీయ కుంభకోణాల్లో కూరుకుపోయి పరువు తీసిందని హీరో, టిడిపి నేత నందమూరి బాలకృష్ణ అనంతపురం జిల్లాలో అన్నారు.
కాంగ్రెస్, అవినీతి, అరాచకాలు ప్రపంచ దేశాల్లో భారత్ ప్రతిష్టను మసకబార్చాయన్నారు. వైయస్ అక్రమాలు పరదేశంలో తెలుగోడి పరువు తీశాయన్నారు. లక్ష కోట్ల రూపాయలు దోచుకున్న జగన్, ఆ అవినీతి సొమ్ముపై వైయస్సార్ కాంగ్రెసు పునాదులు వేసి ఎన్నికల్లో కల్లిబొల్లి మాటలతో ప్రజలన మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
ఓట్లు, సీట్లను నోటల్తో కొలిచే వ్యక్తులకు బుద్ధఇ చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి సీటు కోసం ఆరాటపడుతున్న జగన్, అధికారంలోకి వచ్చాక దాన్ని అడ్డం పెట్టుకొని కేసులు మాఫీ చేయించుకుంటారన్నారు. రాష్ట్ర విభజన కాంగ్రెసు కుటిల నీతికి నిదర్శనమన్నారు. కాంగ్రెసు పార్టీని ఓడించాలన్నారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications