టిడిపి వైపు డిఎల్: జగన్‌పై ఫైర్, టిడిపిలోకి ఎమ్మెల్యేలు

DL Ravindra Reddy likely to join TDP
హైదరాబాద్/కడప: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైయస్ జగన్ లాంటి సైకోను ఓడించే సత్తా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకే ఉందని చెప్పారు. తాను తెలుగుదేశం పార్టీలో చేరే విషయాన్ని మూడ్రోజుల్లో ప్రకటిస్తానని రవీంద్రారెడ్డి తెలిపారు.

అంతకుముందు ఆయన కడప జిల్లాలోని దువ్వూరులో తన అనుచరులు, టిడిపి కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించారు. టిడిపి నియోజకవర్గ ఇంఛార్జ్ సుధాకర్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

భేషజాలకు పోకుండా స్థానిక ఎన్నికల్లో టిడిపి అభ్యర్థులను గెలిపించుకోవాలని రవీంద్రారెడ్డి పిలుపునిచ్చారు. దువ్వూరు మండలంలోని 15 ఎంపిటిసిలకు గాను 13 ఎంపిటిసి సభ్యులను గెలిపించి కార్యకర్తలు సత్తా చాటుకోవాలని రవీంద్రారెడ్డి పిలుపునిచ్చారు.

టిడిపిలోకి చేరనున్న ఎమ్మెల్యేలు

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును మాజీ మంత్రి తోట నర్సింహం తోపాటు గుంతకల్లు ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో అవకాశం కల్పిస్తే తాను తెలుగుదేశం పార్టీలో చేరతానని మధుసూదన్ గుప్తా తెలిపినట్లు సమాచారం.

కాగా సోమవారం సాయంత్రం చంద్రబాబు సమక్షంలో పలువురు సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టిడిపిలో చేరనున్నారు. వారిలో దావులూరి దొరబాబు (పెద్దాపురం), ఎమ్మెల్సీ తిప్పేస్వామి (అనంతపురం), శంకర్ యాదవ్ (తంబళ్లపల్లి), కుతూహలమ్మ (గంగాధర నెల్లూరు) ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+