నారా లోకేశ్ భర్త నారా చంద్రబాబు నాయుడా ..!?

అమరావతి: మీరు చదివింది కరెక్టే! ఇందులో తప్పులేమీ లేవు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ ల హజ్బెండ్లు ఎవరో తెలుసా? తెలియకపోతే.. ఇది చదవాల్సిందే. స్వయంగా.. వారిద్దరూ వేర్వేరుగా రిటర్నింగ్ అధికారికి అందజేసిన నామినేషన్ పత్రాల్లో ఉన్న పదాలివి. నామినేషన్ పత్రాల్లో ఏ చిన్న తప్పు దొర్లినా, వాటిని తిరస్కరిస్తారు రిటర్నింగ్ అధికారులు. చంద్రబాబు, లోకేష్ లు నామినేషన్ పత్రాలతో పాటు జత చేసిన అఫిడవిట్ లో అర్థాలే మారిపోయేలా తప్పులు దొర్లాయి. మామూలుగానైతే, అచ్చులో పొరపాట్లని సర్దుకు పోవచ్చు గానీ.. ఏకంగా నామినేషన్ పత్రాలతో జత చేసిన అఫిడవిట్ లోనే ఇలాంటి మిస్టేక్స్ చోటు చేసుకోవడం, కనీసం వాటిని సరిదిద్దాలన్న తాపత్రయం ఆ ఇద్దరు నాయకుల్లో లేకపోవడం.. నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతున్నట్లుగా భావించుకోవచ్చు.

ఇంతకీ అసలు విషయం ఏమిటంటే- చంద్రబాబు నాయుడు నామినేషన్ పత్రాలతో జతచేసిన అఫిడవిట్‌లో తండ్రి పేరు అనే చోట, భర్త పేరు అని పడింది. దాన్ని సరి చేయలేదు. చంద్రబాబు నాయుడు భర్త పేరు అనే చోట.. ఖర్జూర నాయుడు అని టైప్ చేశారు. ఇలాంటి అచ్చు తప్పే.. ఆయన కుమారుడు, మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ అఫిడవిడ్ లోనూ చోటు చేసుకుంది.

Do you know who is the husbands of AP CM Chandrababu and his Son Lokesh?

అభ్యర్థి పేరు లోకేష్ నారా అని, భర్త పేరు చంద్రబాబు నాయుడు అని టైప్ చేశారు. భర్త పేరుకు బదులుగా తండ్రి పేరు అక్కడ ఉండాలి. అయినప్పటికీ.. ఆ మాత్రం కూడా సరిదిద్దలేదు. యధాతథంగా ఉంచేసి, అఫిడవిట్ ను రూపొందించారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Do you know who is the husbands of AP CM Chandrababu and his Son Lokesh?

బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ దీనిపై ఘాటుగా విమర్శించారు. లోకేష్ ను లీకేష్ గా సంబోధిస్తూ చెడుగుడు ఆడుకున్నారు. ఆవు చేలో మేస్తే.. దూడ గట్టున మేస్తుందా? అనే సామెత నిజం చేశావ్. నువ్వు అవినీతిలో డాడీకి కాపీ.. తెలివిలో డాడీకి కలర్ జిరాక్స్ అనుకున్నాం. కానీ ఆఖరికి అఫిడవిట్‌లోనూ కాపీనేనా? ఇద్దరికీ అఫిడవిట్ సరిగా వేయడం రాదుగానీ అమరావతిని అమెరికా చేస్తానని కేఏ పాల్ కబుర్లు చెప్తారా? అంటూ సెటైర్లు వేశారు. పలువురు నెటిజన్లు సైతం కామెంట్లను సంధిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+