పాము, కుక్క కాట్లకు వ్యాక్సిన్ కావాలా? 15400 నెంబర్‌కు ఒక్క పోన్ కొట్టండి!
దేశంలో పాము, కుక్క కాట్ల కారణంగా మరణాలను నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం వినూత్న ఆలోచనకు తెరలేపింది. కుక్క, పాము కాటులకు గురైన వారికి సత్వర చికిత్స అందించే చర్యల్లో భాగంగా ఓ హెల్ప్‌లైన్ నెంబర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. బాధితులు జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన 15400 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదిస్తే వ్యాక్సిన్‌లు ఎక్కడ లభిస్తాయనే సమాచారాన్ని వెంటనే తెలియజేస్తుంది.
అక్టోబర్ 21 నుంచి తెలుగులో..
ఈ కేంద్రం జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయగా.. అనుసంధానంగా విజయవాడలో దీనిని ప్రారంభించారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల మధ్య దీనిని కమ్యునికేట్ అవ్వొచ్చు. ప్రస్తుం ఇంగ్లీష్, హిందీ భాషల్లో అందుబాటులో ఉండగా, అక్టోబర్ 21 నుంచి తెలుగులోనూ సమాధానం ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ కాల్ సెంటర్‌ను ఏపీతోపాటు మధ్యప్రదేశ్, దిల్లీ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్(ఎన్‌సీడీసీ), యునైటెడ్ నేషన్ డెవలప్‌మెంట్ ఫండ్(యుఎన్‌డీపీ) సంయుక్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభంచింది.

ముందస్తు సమాచారం అందివ్వడం..
సమీప ఆరోగ్య కేంద్రంలో బాధితులకు కుక్క కాటు, పాము కాటుకు వ్యాక్సిన్‌ల లభ్యతతో పాటు ముందస్తు జాగ్రత్తలు వంటి సమాచారం అందించడమేకాకుండా అవగాహన కల్పించేందుకు ఇవి దోహదపడతాయి. ఇందుకు సంబంధించి తెలుగులో ముద్రించిన పోస్టర్లు, కరపత్రాల్ని ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు విడుదల చేశారు.
రారున్న 2030 నాటికి కుక్క కాటు వల్ల వచ్చే రేబిస్ వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలన్న లక్ష్యంతో దీనిని రూపొందించినట్లు అధికారులు చెబుతున్నారు. మనుషుల్లో నమోదైన రేబిస్ కేసులు 99 శాతం వరకూ కుక్కతోనే వ్యాప్తి చెందుతున్నట్లు వెల్లడైంది. ఈ రేబిస్ వ్యాధి కారణంగా ఏడాదికి 20,000ల మంది వరకు మరణిస్తున్నారు. గత ఏడాది దేశవ్యాప్తంగా 30.43 లక్షల కుక్క కాటు కేసులు నమోదవ్వగా, ఏపీలో 2023లో 2,12,246 కేసులు నమోదయ్యాయి.












Click it and Unblock the Notifications