భూమా హెల్త్: ఆసుపత్రికి భారీగా అభిమానులు, కాసేపట్లో హెల్త్ బులెటిన్
నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆరోగ్యంపై ఆసుపత్రి వైద్యులు కాసేపట్లో హెల్త్ బులెటిన్ విడుదల చేయనున్నారు. ఆయనకు వెంటిలెటర్ పైన చికిత్స అందిస్తున్నారు.
కర్నూలు: నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆరోగ్యంపై ఆసుపత్రి వైద్యులు కాసేపట్లో హెల్త్ బులెటిన్ విడుదల చేయనున్నారు. ఆయనకు వెంటిలెటర్ పైన చికిత్స అందిస్తున్నారు.
బైపాస్ సర్జరీ
భూమా నాగిరెడ్డికి గతంలో రెండుసార్లు గుండెపోటు వచ్చింది. ఇప్పుడు మరోసారి వచ్చింది. ఇటీవలే బైపాస్ సర్జరీ జరిగింది. భూమా ఆరోగ్యం సీరియస్‌గా ఉంటే హైదరాబాద్ తరలించాలని చంద్రబాబు ఇప్పటికే ఆదేశించారు.

తరలి వచ్చిన అభిమానులు
నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి గుండెపోటు వచ్చి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసి.. నంద్యాలలో ఆయన ఉన్న ఆసుపత్రికి పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు తరలి వచ్చారు.
శనివారమే చంద్రబాబును కలిశారు
జెడ్పీటీసీ, ఎంపీటీసీలతో కలిసి భూమా నాగిరెడ్డి శనివారమే చంద్రబాబును కలిశారు. జిల్లాలో ఎమ్మెల్సీ అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డిని గెలిపిస్తానని చెప్పారు. ఈ మేరకు పలువురు నాయకులతో కలిసి చంద్రబాబును కలిసి వెళ్లారు.












Click it and Unblock the Notifications