కొడాలి నాని ఆరోగ్యం పై తాజా అప్డేట్ - జగన్ పరామర్శ..!!
మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్యం పై వైద్యులు కీలక అంశాలు వెల్లడించారు. నాని కి హృద్రోగ సమస్యలున్నాయని వైద్యులు నిర్ధారించారు. గుండె సంబంధిత సమస్యలు గుర్తించిన వైద్యులు .. మూడు వాల్వులు బ్లాక్ అయినట్లు పరీక్షల్లో తేలినట్లు వెల్లడించారు. ఆపరేషన్ చేయాల్సి ఉందని పేర్కొన్నారు. అయితే, అత్యవసరంగా చేయించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇక, నాని ఆరోగ్య పరిస్థితి పైన ఏఐజీ వైద్యులతో మాజీ సీఎం జగన్ మాట్లాడారు. సర్జరీ గురించి చర్చించారు.
నాని కుటుంబ సభ్యులతోనూ జగన్ మాట్లాడారు.
గుండె సమస్యలతో
వైసీపీ ముఖ్య నేత కొడాలి నాని అస్వస్థతకు గురైన విషయం తెలియటంతో పార్టీ శ్రేణుల్లో ఆందోళ న మొదలైంది. ఛాతీలో నొప్పితో నాని బుధవారం హైదరాబాద్ లోని ఏఐజీలో చేరారు. అక్కడ వైద్యులు అన్ని పరీక్షలు చేసారు. గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. మూడు వాల్వ్స్ బ్లాక్ అయినట్టు వైద్యులు నిర్దారించారు. ప్రస్తుతం కొడాలి నాని వైద్యుల పర్యవేక్షణలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన ఆపరేషన్‌కూడా చేయాల్సి ఉంటుందని వైద్యులు చెప్పారు. నాని అనారోగ్య సమస్యల పైన ఇప్పటి వరకు పార్టీలోని నేతలకు సమాచారం లేదు. తాజాగా ఏఐజీ వైద్యులతో మాజీ సీఎం జగన్ మాట్లాడిన సందర్భంలో నాని గుండె సమస్య గురించి బయటకు తెలిసిందని పార్టీ నేతలు చెబుతున్నారు.

జగన్ ఆరా
కాగా, నానికి అన్ని రకాల పరీక్షలు చేసిన వైద్యులు గుండె కవాటాల్లో ఏర్పడిన క్లాట్లకు సంబంధిం చి అంత అత్యవసరంగా చికిత్స చేయించుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. స్టంట్ లు వేయడమా, బైపాస్ సర్జరీ చేయడమా అనే అంశం పైన సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలని నాని కుటుంబం సభ్యులు భావిస్తున్నారు. ఇందు కోసం కొడాలి నాని సైతం ఇతర హాస్పిటల్స్ వైద్యుల తో సంప్రదింపులు చేస్తున్నారు. సెకండ్ ఒపీనియన్ తరువాత ఉగాది తరువాత పూర్తిస్థాయి చికిత్స చేయించుకోవాలని కొడాలి నాని నిర్ణయించారు. ఈ రోజు ఆస్పత్రి నుంచి కొడాలి నాని డిశ్చార్జ్ కానున్నారు. కాగా, ఈ రోజు కొడాలి నానితో మాజీ సీఎం జగన్ మరో సారి మాట్లాడారు. ఆపరేషన్ గురించి ఆరా తీసినట్లు తెలుస్తోంది.
చికిత్స పై నిర్ణయం
కొడాలి నాని 2024 ఎన్నికల్లో ఓడిన తరువాత రాజకీయంగా అంత క్రియాశీలకంగా లేరు. గతంలో నూ అనారోగ్య సమస్యలతో హైదరాబాద్ లో చికిత్స తీసుకున్నారు. మంత్రిగా ఉన్న సమయంలో టీడీపీ నేతల పైన సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరు వాత నాని పైన అనేక కేసులు ఉండటంతో.. ఆయన కోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ తీసుకున్నారు. కొంత కాలంగా జగన్ తో సమావేశాలకు మినహా పార్టీ కార్యక్రమాల్లో కొడాలి నాని అంత యాక్టివ్ గా పాల్గొనటం లేదు. ఇక, ఇప్పుడు నాని అనారోగ్య సమస్యల పైన ఆయన అనుచర వర్గంలో ఆందోళన కనిపించింది. కాగా.. ఇప్పుడు నాని డిశ్చార్జ్ కానుండటం.. ఉగాది తరువాత చికిత్సకు నిర్ణయించారు.












Click it and Unblock the Notifications