నేను ఎంపీగా లేకున్నా నష్టంలేదు - మాధవ్ వ్యవహారం పర్సనల్ కాదు : కేశినేని నాని..!!

టీడీపీ ఎంపీ కేశినేని కీలక వ్యాఖ్యలు చేసారు. రాజకీయ నాయకులు నిస్వార్థంగా పని చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. వైద్యానికి భారత్ ప్రపంచానికే ఒక మైలు రాయిలా మారిందన్నారు. కొంత కాలంగా కేశినేని నాని టీడీపీలో అసంతృప్తిగా ఉన్నారంటూ కొంత కాలంగా ప్రచారం సాగుతోంది. ఆయన ఢిల్లీ లో ఆఫ్ ది రికార్డుగా చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చకు కారణమయ్యాయి. ఆ తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి వెళ్లిన సమయంలో బొకే ఇచ్చే వేళ కేశినేని విసురుగా వ్యవహరించిన తీరు పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

పార్టీలో అసంతృప్తిగా లేను

పార్టీలో అసంతృప్తిగా లేను

పార్టీ అధినేత చంద్రబాబుతో మాత్రం కేశినేని నాని సఖ్యతగా కొనసాగుతున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. విజయవాడలో కేశినేని నాని వ్యతిరేకంగా కొందరు నేతలు వ్యవహరిస్తున్న తీరు పైన ఆయన ఆగ్రహంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో ఇప్పుడు కేశినేని నాని పార్టీ పైన తన అభిప్రాయాలను స్పష్టం చేసారు. తాను పార్టీలో అసంతృప్తిగా లేనంటూ నాని స్పష్టం చేసారు. మీడియాను తన మీద ఫోకస్ చేయవద్దంటూ నాని సూచించారు. తన లాంటి నానిలు లక్ష మంది పుట్టుకొస్తారని చెప్పుకొచ్చారు. మాధవ్ వీడియో వ్యవహారం పైన ఆయన స్పందించారు. అది మాధవ్ ప్రయివేటు వ్యవహారం కాదని పేర్కొన్నారు.

ఎంపీగా లేకపోయినా జరిగే నష్టం ఏమీ లేదంటూ

ఎంపీగా లేకపోయినా జరిగే నష్టం ఏమీ లేదంటూ

తాను విజయవాడకు ఎంపీగా లేకపోయినా జరిగే నష్టం ఏమీ లేదంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. అదే సమయంలో తన కార్ల పైన ఎప్పుడైనా ఎక్కడైనా ఎంపీ స్టిక్కర్ కనిపించిందా అంటూ ప్రశ్నించారు. తనకు సంబంధిచి వినియోగించే ఒక్క కారు పైనే ఎంపీ స్టిక్కర్ ఉంటుందని వివరించారు. తన ఎంపీ స్టిక్కర్ ఉన్న కారుతో తన కుమార్తును కూడా తిరగనివ్వనని నాని చెప్పుకొచ్చారు. కొద్ది రోజుల క్రితం తన ఎంపీ స్టిక్కర్ వేరే వ్యక్తులు దుర్వినియోగం చేస్తున్నారంటూ ఎంపీ నాని లోక్ సభ స్పీకర్ తో పాటుగా రెండు రాష్ట్రాల డీజీపీలకు ఫిర్యాదు చేసారు. తన సోదరుడు కేశినేని చిన్ని పైన ఈ ఫిర్యాదు చేసారు.

నాని తాజా వ్యాఖ్యలతో కొత్త చర్చ

నాని తాజా వ్యాఖ్యలతో కొత్త చర్చ

దాని పైన కేశినేని చిన్ని స్పందించారు. ఇప్పుడు, కేశినేని నాని తాను టీడీపీలో ఎటువంటి అసంతృప్తిగా లేనని చెప్పటం రాజకీయంగా విజయవాడ టీడీపీలో కొత్త చర్చకు కారణమవుతోంది. అదే సమయంలో తాను విజయవాడ ఎంపీగా లేకపోయినా ఎటువంటి నష్టం లేదని వ్యాఖ్యానించటం ద్వారా..కొంత కాలంగా నాని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయరనే చర్చకు మరో సారి అస్కారం ఏర్పడింది. ఆ ఉద్దేశంతోనే నాని ఈ వ్యాఖ్యలు చేశారా అనేది మరో ప్రశ్న. దీంతో..ఇప్పుడు కేశినేని నాని ఏ రకమైన వ్యాఖ్యలు చేసినా రాజకీయంగా చర్చకు కారణమవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+