వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నమ్మను: కిరణ్ 'బ్యాక్ ఆఫీసు'పై డొక్కా, లగడపాటి పైనా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Dokka on Kiran's back office
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి 'బ్యాక్ ఆఫీస్' తెరిచారంటే తాను నమ్మలేనని మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. కిరణ్ పైన ఆయన శనివారం ఆసక్తికరమై వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సిఎం ఎంత కష్టపడి రెండు చేతులతో సంతకాలు పెడుతున్నా ప్రజలకు సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు. ఆయన రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని ఎద్దేవా చేశారు. లగడపాటి రాజగోపాల్ తమ ఆకాంక్షలను బలంగా తెలియజేశారన్నారు.

ముఖ్యమంత్రి కొత్త పార్టీ పెట్టరని, ప్రెస్‌మీట్ పెడతారని, పార్టీ పెట్టడమంటే ప్రెస్‌మీట్ పెట్టినంత ఈజీ కాదని డొక్కా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆయన కాంగ్రెస్‌వాది అని, ఆయన తండ్రి కాంగ్రెస్‌లో సీనియర్ అని, సీనియర్ లీడర్ రోశయ్య తర్వాత కిరణ్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని సోనియా భావించారన్నారు.

సోనియా ఆదేశాలతోనే కిరణ్ సిఎంగా కొనసాగుతున్నారని, ఆయన కాంగ్రెస్‌లోనే ఉంటారని పేర్కొన్నారు. చిన్న వయస్సులోనే స్పీకర్‌గా చేసిన కిరణ్‌పై సోనియాకు నమ్మకం ఎక్కువని, అందుకే సీనియర్లు కొందరు ఆయనను తొలగించాలని సూచించినా పట్టించుకోలేదన్నారు. దీంతో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా మూడన్నరేళ్లు పదవిలో కొనసాగారన్నారు.

తాను గానీ, సిఎం గానీ నియోజకవర్గ స్థాయికే ఎక్కువని, అలాంటిది ఆయనను సిఎంగా, తనను మంత్రిగా సోనియా చేశారన్నారు. సోనియా ఇచ్చిన అవకాశంతోనే ఈ స్థాయిలో ఉన్న సిఎం ఆమెను ధిక్కరిస్తారని తాను భావించడం లేదని చెప్పారు. సీమాంధ్ర ఎంపీలు ప్రజల ఆకాంక్షను తెలియజేశారని, ప్రజాకాంక్షను కేంద్రం దృష్టిలోకి తీసుకుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

English summary
Minister from Seemandhra said that Kiran kumar Reddy will not launch new party, he will only address press meets.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X