చిరుకు తమ్ముళ్లం: పవన్‌పై డొక్కా, నోటి దూల: ఆనం

Dokka says they are political brothers to Chiranjeevi
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తమ పార్టీ నేత, కేంద్ర పర్యాటక శాఖమంత్రి చిరంజీవి రక్తం పంచుకొని పుట్టిన తమ్ముడే కావొచ్చు కానీ, రాజకీయ తమ్ముళ్లుగా తమ పార్టీ నేతలం, దళితులమంతా చిరుకే అండగా ఉంటామని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్ అన్నారు.

నోటి దూల తీర్చుకునేందుకే: ఆనం వివేకా

పవన్ కళ్యాణ్‌ది తోకచుక్క పార్టీ అని, నాలుగేళ్లకు కానీ వచ్చే అవకాశం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి ఎద్దేవా చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నోటి దూల తీర్చుకునేందుకే పవన్ మీటింగ్ పెట్టాడని, ఇప్పుడు అది తీరిపోవడంతో తిరిగి సినిమాల్లోకి వెళ్లిపోతారన్నారు. ఎప్పుడో నాలుగేళ్ల తర్వాత వచ్చే పార్టీ గురించి ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదన్నారు.

సినిమా కాదు: విహెచ్

రాజకీయాలంటే సినిమాల్లో నటించినట్లు ఉంటుందని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారని కాంగ్రెస్ సీనియర్ రాజ్యసభ సభ్యులు వి హనుమంత రావు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హటావో అంటున్న పవన్‌ని ప్రజలే హటావో అనే రోజు దగ్గరలోనే ఉందన్నారు. కాంగ్రెస్‌ను తరిమేస్తానన్నవారే తరిగిపోయారని, ఇప్పుడు కన్పించకుండా పోయారన్నారు. తాను వ్యక్తిగతంగా అయితే పవన్‌ను విమర్శించే వాడిని కాదని, రాజకీయాల్లోకి వచ్చిందున పవన్ పెళ్లిని ప్రస్తావించవలసి వచ్చిందన్నారు.

ఓటెక్కడుంది: బలరాం

దేశం కోసం త్యాగం చేసిన ఇందిర, రాజీవ్ కుటుంబం గురించి పవన్‌కేం తెలుసునని, అసలు ఆయన ఓటు ఎక్కడుందో తెలుసా అని కేంద్రమంత్రి బలరాం నాయక్ ప్రశ్నించారు. పైవ్‌స్టార్ హోటల్‌లో పార్టీ పెట్టడంతో సామాజిక న్యాయం రాదన్న విషయాన్ని ఆయన తెలుసుకోవాలన్నారు. కాంగ్రె స్‌ను విమర్శించడమంటే ఎస్సీ, ఎస్టీలను అవమానించడమేనన్నారు.

పవన్ కళ్యాణ్ ఓ అజ్ఞాని అని, తెలంగాణ వ్యతిరేకి అని తెలంగాణ మాలమహానాడు నేత అద్దంకి దయాకర్ నిప్పులు చెరిగారు. వేయికి పైగా యువకులు తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసినప్పుడు కాని గాయం.. విభజన జరిగిన తీరు చూసినప్పుడు అయిందా, తెలంగాణపై మాట్లాడే నైతిక హక్కు పవన్‌కు లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+