వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సమైక్యం కాదు వాస్తవం, ఎన్నికల్లో గెలిచేది నేనే: డొక్కా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Dokka Manikya Vara Prasad
హైదరాబాద్: సమైక్యాంధ్ర పేరుతో వెళితే ఓట్లు వస్తాయని తమ ప్రాంత నాయకులు అనుకుంటున్నారని, ప్రస్తుతం ప్రజలకు చెప్పాల్సింది వాస్తవాలని మంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్ ఆదివారం అన్నారు. ప్రస్తుతం తాను ప్రజలకు వాస్తవాలు చెబుతున్నానని, రేపు ఎన్నికల్లో గెలిచేదీ తానేనన్నారు. శాసనమండలి లాబీల్లో ఆదివారంనాడు విలేకరులతో పిచ్చాపాటిగా ఆయన మాట్లాడారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో, రాష్ట్రంలో జరిగింది విధ్వంసక అభివృద్ధి అని అభిప్రాయం వ్యక్తం చేశారు.

రేపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకా ఆలోచనా విధానం మారకుంటే ఇదే విధ్వంసక అభివృద్ధి జరుగుతుందన్నారు. కోస్తాలోనూ తూర్పు కనుమల్లో బాక్సైట్ తవ్వకం పేరుతో విధ్వంసక అభివృద్ధే జరుగుతున్నదన్నారు. అభివృద్ధి విషయంలో ఆలోచనా విధానం మారాలని, విధ్వంసక అభివృద్ధి కాకుండా వికేంద్రీకృత అభివృద్ధి జరగాలన్నారు. హైదరాబాద్‌లో అభివృద్ధి సంతృప్తస్థాయికి చేరుకుందని, ఇక నగరంలో పారిశ్రామిక అభివృద్ధిపై నిషేధం పెట్టాలన్నారు.

నెలాఖరులోగా రాష్ట్రంలో సమైక్యాంధ్ర పేరుతో మరో కొత్త పార్టీ ఆవిర్భవించే అవకాశాలున్నాయని ఆనం వివేకానంద రెడ్డి అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కిరణ్‌కు తాను అత్యంత సన్నిహితుడిననీ, పార్టీ పెట్టే ఆలోచనే ఉంటే తనతో చర్చించి ఉండేవారని చెప్పారు.

అయితే, సీమాంధ్రలో వెలుస్తున్న జై సమైక్యాంధ్ర ఫ్లెక్సీలు, ఇతర వాతావరణం చూస్తుంటే మరో కొత్త పార్టీ రాబోతోందన్న సంకేతాలు వెలువడుతున్నాయన్నారు. రాజ్‌నాథ్‌సింగ్ ప్రసంగాన్ని చూస్తే విభజనకు బ్రేక్ పడేలా ఉందన్నారు. టిడిపిలోకి వెళుతున్నామనే ప్రచారాలను ఆయన కొట్టి పారేశారు. అలాంటి దుస్థితి తమకు ఇంకా రాలేదన్నారు.

English summary

 State Minister Dokka Manikya Vara Prasad on Sunday suggested Seemandhra leaders on Telangana Draft Bill.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X