కిరణ్ సీతారామారావులాంటివాడు, పార్టీ పెట్టరు: డొక్కా

కాంగ్రెసు పార్టీకి ఎవరు రాజీనామా చేసినా పెద్దగా పోయేదేమీ లేదని ఆయన అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి ఎందుకు రాజీనామా చేశారో అర్థం కావడం లేదని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల వద్ద వ్యాఖ్యానించారు.
కిరణ్ కుమార్ రెడ్డి ఇన్నాళ్లు సమైక్యం ముసుగులో ప్రజలను మభ్య పెట్టారని మరో మంత్రి బాలరాజు విమర్సించారు. ఇన్నాళ్లు ఎవరికీ పదవులు ఇవ్వకుండా చివరి నిమిషంలో తనకు కావాల్సినవారికి కట్టబెట్టారని ఆయన విమర్శించారు. విభజన ప్రక్రియ కిరణ్ కుమార్ రెడ్డికి తెలియకుండా జరిగిందని అనుకోవడం లేదని ఆయన అన్నారు.
తన పదవికి రాజీనామా చేసిన కిరణ్‌కుమార్‌రెడ్డి కొత్త పార్టీ పెట్టడం ఖాయమని శాసనసభ్యుడు వీరశివారెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ భుస్థాపితం అవుతుందని ఆయన స్పష్టం చేశారు. కిరణ్ పెట్టబోయే పార్టీలో తాను చేరతానని, సీమాంధ్రలో కిరణ్ పార్టీ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని వీరశివారెడ్డి అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications