కాంగ్రెస్‌లోనే ఉంటా: డొక్కా యు టర్న్, పితాని కిరణ్ వైపే

 Dokka Manikya Vara Prasad
హైదరాబాద్: తీవ్ర తర్జన భర్జన అనంతరం తాను కాంగ్రెసు పార్టీలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నానని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్ ఆదివారం చెప్పారు. డొక్కా తెలుగుదేశం పార్టీలో చేరనున్నారనే వార్తలు ఇటీవల గుప్పుమన్న విషయం తెలిసిందే. టిడిపిలో చేరిన రాయపాటి సాంబశివ రావు ఇటీవల మాట్లాడుతూ... డొక్కా కూడా టిడిపిలో చేరుతారని చెప్పారు. దీంతో డొక్కా త్వరలో కాంగ్రెసు పార్టీకి గుడ్ బై చెప్పి టిడిపిలో చేరుతారనే ప్రచారం జరిగింది.

అయితే, ఆయన తన మనసు మార్చుకున్నారు. రాయపాటి తనకు గురువు అని, తన గురువు మాట జవదాటడం బాధగానే ఉందని చెప్పారు. తాను కాంగ్రెసు పార్టీలోనే ఉండాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. తనకు కాంగ్రెసు పార్టీ రాజకీయ జీవితాన్ని ఇచ్చిందన్నారు.

పితాని కూడా...

తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను మాజీ మంత్రి, జై సమైక్యాంధ్ర నేత పితాని సత్యనారాయణ ఆదివారం ఖండించారు. ఏ పార్టీలోనూ చేయడం లేదని ఆయన అన్నారు. జై సమైక్యాంధ్ర పార్టీ ఉద్యమ పార్టీ అని, అదే పార్టీలో కొనసాగుతానని స్పష్టం చేశారు.

టిడిపికి దూరం కాదు: అశోక్ బాబు

తెలుగుదేశం పార్టీతో ఉద్యోగ సంఘాలు దూరంగా ఉండాలని అనుకోవడం లేదని ఎపిఎన్జీవో అధ్యక్షులు అశోక్ బాబు ఆదివారం చెప్పారు. ఎపిజెఎఫ్ మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో అశోక్ బాబు మాట్లాడారు. అభివృద్ధిపై చంద్రబాబు ఒక అడుగు ముందుకు వేస్తే తాను రెండు అడుగులు సహకరిస్తానని చెప్పారు. కొత్త ఉద్యోగాల కల్పన, ఉద్యోగ భద్రతపై చంద్రబాబు నుండి వచ్చే మాట కోసం అందరం ఎదురు చూస్తున్నామన్నారు. ఉద్యోగుల పట్ల తెలుగుదేశం పార్టీ విధివిధానాలు తెలపాలని కోరారు.

దానికి బాబు సానుకూలంగా స్పందించారు. తాము అధికారంలోకి రాగానే ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఉద్యోగుల విధి నిర్వహణలో అభద్రతకు చోటు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. తాము పూర్తిగా ప్రైవేటు రంగానికి ప్రాధాన్యత ఇవ్వడంలేదని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు పోటీ పడితే అంతిమంగా ప్రజలకు మేలు చేకూరుతుందన్నది తన ఆలోచన అని బాబు వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+