వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మగాళ్లు మారాలి: అసదుద్దీన్, రేపిస్టులకు బెయిలొద్దని..

|
Google Oneindia TeluguNews

Don't give bail to rapists says MP Asaduddin Owaisi
న్యూఢిల్లీ: మహిళలపై అత్యాచారాలు చేసే వారికి బెయిల్ ఇవ్వకూడదు, శిక్ష సస్పెండ్ చేయకూడదని ఎంఐఎం ఎంపి అసదుద్దీన్ ఒవైసీ శుక్రవారం లోకసభలో డిమాండ్ చేశారు. లోకసభలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై 193 నియమం కింద జరుగుతున్న చర్చలో ఒవైసీ పాల్గొన్నారు. పురుషుల వైఖరిలో మార్పు రావాలని ఆయన అన్నారు. అత్యాచారాలను అరికట్టేందుకు గట్టి చట్టాల అవసరం ఉందని సూచించారు.

దేశంలో ప్రతి ఇరవై రెండు నిమిషాలకు ఒక అత్యాచారం జరుగుతున్నట్లు క్రైం రికార్డ్‌బ్యూరో సేకరించిన వివరాలు వెల్లడిస్తున్నాయని ఆయన తెలిపారు. 2013లో 33,707 మానభంగం కేసులు నమోదు కాగా శిక్షలు మాత్రం కేవలం 27.1 శాతం మాత్రమేనని ఒవైసీ తమ విచారాన్ని వ్యక్తం చేశారు. నమోదు అయిన కేసులే ఇన్ని ఉంటే ఇక నమోదు కాని కేసులు ఎన్ని ఉంటాయో ఊహించుకోవచ్చన్నారు.

మహిళలపై అత్యాచారాల కేసులు మూడు లక్షల పదివేలుంటే శిక్ష మాత్రం కేవలం ఇరవై రెండు శాతం మందికే పడిందన్నారు. నిర్భయ చట్టం ఏర్పడిన తరువాత కూడా పరిస్థితిలో పెద్దగా మార్పు లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని 374, 389 సెక్షన్లకు మార్పులు చేయవలసిన అవసరం ఎంతో ఉందని ఒవైసీ సూచించారు.

ట్రయల్ కోర్టులో శిక్ష పడిన తరువాత నిందితులు అప్పిలేట్ కోర్టులో శిక్షను సస్పెండ్ చేయించుకుంటున్నారని ఆయన తెలిపారురు. నిర్భయ చట్టం ఏర్పడిన తరువాత కూడా దాదాపు 90శాతం మంది నిందితులు శిక్ష పడకుండా తప్పించుకుంటున్నారని ఒవైసీ తెలిపారు. ముజఫర్‌నగర్ కేసుల విషయంలో ఒక్క చార్జిషీట్ కూడా దాఖలు చేయకపోవటం సిగ్గు చేటని ఆయన దుయ్యబట్టారు.

English summary
AIMIM MP Asaduddin Owaisi on Friday said that don't give bail to rapists.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X