డోన్ట్ మిస్.. గుడ్ ఛాన్స్: ఏపీలోని అన్ని స్కూళ్లల్లో 5 నుంచి..!!
Aadhaar Special camps in AP Schools: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. తల్లిదండ్రులకు గుడ్ న్యూస్ చెప్పింది. వారి పిల్లల ఆధార్ కార్డు అప్ డేట్ కోసం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో మరో విడత ప్రత్యేక శిబిరాలను నిర్వహించబోతోంది.
ఈ ఆధార్ క్యాంపులు ఈ నెల 5వ తేదీన ఆరంభం కానున్నాయి. 9వ తేదీ వరకు కొనసాగనున్నాయి. నవంబర్, డిసెంబర్ లల్లో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆధార్ క్యాంపులు జరిగాయి. అయినప్పటికీ- ఆధార్ కార్డు వివరాలను అప్ డేట్ చేసుకోని పిల్లల సంఖ్య లక్షల్లో ఉంటోంది. మొత్తం 16.51 లక్షల మంది విద్యార్థులు ఉండగా.. ఇప్పటివరకు 5.94 లక్షలు పూర్తయ్యాయి. ఇంకా 10.57 లక్షలు పెండింగ్ లో ఉన్నాయి. వారి ఆధార్ కార్డులు అప్‌డేట్ కాలేదు.

దీంతో మరో విడత తమ పిల్లల ఆధార్ కార్డు అప్ డేట్ చేసుకోవడానికి తల్లిదండ్రులకు అవకాశం కల్పించింది ప్రభుత్వం. వారందరూ కూడా తమ ఆధార్ కార్డును అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే కార్డు ఇన్ యాక్టివ్ అవుతుంది. 5 నుంచి 17 సంవత్సరాల లోపు పిల్లలు తమ బయోమెట్రిక్, ఇతర వివరాలను ఈ క్యాంపుల ద్వారా అప్‌డేట్ చేసుకోవచ్చు. 15 నుంచి 17 ఏళ్ల జూనియర్ కాలేజ్ విద్యార్థులు తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్‌డేట్ చేయించుకోవాలి. బయోమెట్రిక్ అప్ డేట్ లేకపోతే నీట్, జేఈఈ వంటి పరీక్షలకు అనుమతి లభించకపోవచ్చు.
విద్యార్థులు తమ సమీప పాఠశాల / జూనియర్ కాలేజీలో జరిగే ఆధార్ స్పెషల్ క్యాంప్‌కు హాజరుకావాలి. పాఠశాలలు, కాలేజీ సిబ్బంది ఈ విషయంపై విద్యార్థులను అవగాహన కల్పించాలి. వారికి అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేయాలి. ఈ క్యాంపుల సమయంలో నియమిత సిబ్బందిని ఇతర పనులకు నియమించకూడదు.
ఆధార్ అప్ డేట్ ఉచితం. ఎటువంటి ఫీజు కూడా చెల్లించనక్కర్లేదు. ఈ క్యాంపుల్లో ఫింగర్ ప్రింట్, ఐరిస్ అప్ డేట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న ఆధార్ కార్డులో పేరులో ఏదైనా తప్పులు ఉంటే దాన్ని సరిచేసుకోవచ్చు. దీనికోసం బర్త్ సర్టిఫికెట్ ను ప్రూఫ్ గా చూపించాల్సి ఉంటుంది లేదా స్కూల్ రికార్డుల్లో ఎలా ఉందో అలా పేరును సరి చేసుకోవచ్చు. అడ్రస్ లో ఏవైనా మార్పులు ఉంటే దాన్ని అప్ డేట్ చేసుకోవచ్చు. దీనికి అవసరమైన డాక్యుమెంట్లను అందజేయాల్సి ఉంటుంది. పుట్టిన రోజు తేదీని అప్ డేట్ చేసుకోవచ్చు.
-
Amaravati: అమరావతిపై అసెంబ్లీ తీర్మానం-ఇవాళే కేంద్రానికి-చంద్రబాబు కామెంట్స్..! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్..












Click it and Unblock the Notifications