6గురు రాజధాని రైతులకు షాక్! ఆ భూములమ్మొద్దు, వ్యవసాయమే చేయాలి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత రైతులకు గురువారం నాడు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో షాక్ తగిలింది! భూసమీకరణపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషనర్లు తమ భూముల్లో సొంతంగా వ్యవసాయం చేసుకోవచ్చని కోర్టు తేల్చి చెప్పింది.
అయితే, కౌలుకు ఇవ్వడం, భూమిని అమ్మడం చేయకూడదని పిటిషనర్లకు హైకోర్టు సూచించింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫు న్యాయవాది స్పందిస్తూ.. నిబంధనల ప్రకారమే భూసమీకరణ జరుగుతోందని చెప్పారు. దీంతో వాదోపవాదనలు విన్న కోర్టు విచారణ జులై మొదటి వారానికి వాయిదా వేసింది.

తమ భూములు ప్రభుత్వం తీసుకోవద్దని ఆరుగురు రైతులు, నేషనల్ అలియెన్స్ ఆఫ్ పీపుల్ మూమెంట్ అనే సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇందులో సంస్థ ప్రమేయాన్ని న్యాయస్థానం నిరాకరించింది. దీనిపై విచారణ చేపట్టింది.
రైతులు భూములు అమ్మవద్దని ఆదేశించింది. ఆ భూముల్లో వ్యవసాయం మినహా ఇతరాలు ఏమీ చేయవద్దని చెప్పింది. వ్యవసాయం మాత్రమే చేసుకోవాలని చెప్పింది. అనంతరం విచారణను జూలై మొదటి వారానికి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications