కరోనా అని భయపడొద్దు, ఆత్మహత్య చేసుకోవద్దు: బాలయ్య పిలుపు

కరోనా వైరస్ అంటే చాలా మంది భయపడుతున్నారు. వైరస్ వస్తే ఫియర్‌కు గురై.. మరికొందరు ఆత్మహత్య కూడా చేసుకుంటున్నారు. కరోనాను జయించొచ్చు.. విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని పలువుర పిలుపిస్తున్నారు. తాజాగా ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా పిలుపునిచ్చారు. బుధవార బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్‌కు సంగారెడ్డికి చెందిన మహేశ్వర మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్, PPE కిట్స్, N95 మాస్క్ అందజేశారు.

కరోనా వైరస్ భయంతో ఆత్మహత్య చేసుకోవద్దని నందమూరి బాలకృష్ణ కోరారు. మనందరం కలిసి వైరస్‌ను జయించాలన్నారు. ఇదే అందరి లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. వైరస్ వచ్చిన చాలా మంది ప్లాస్మా థెరపీ చేయించుకుంటున్నారని తెలిపారు. దీనితో చాలా మంది రికవరీ అవుతున్నారని తెలిపారు. కరోనా మహమ్మరిపై కలిసి పోరాడుదామని.. వైరస్‌ను మాత్రం ప్రజలు తేలికగా తీసుకోవద్దని సూచించారు. అజాగ్రత్తగా ఉంటే మనకే నష్టమని సూచించారు.వాక్సిన్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని బాలయ్య తెలిపారు. వైద్యులు, సిబ్బంది కరోనా బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకొన్నామని, చికిత్సకు వచ్చే ప్రతి వ్యక్తిని ముందుగా స్క్రీన్ చేస్తున్నామని చెప్పారు.

dont suicide fear of corona: balakrishna

ఇటు సినిమా షూటింగ్‌లకు సంబంధించి అనుమతి వచ్చిందని.. ఇండస్ట్రీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని బాలకృష్ణ తెలిపారు. షూటింగ్‌ జరిగే సమయంలో చాలా మంది ఉంటారని తెలిపారు. అందుకే ప్రతీ ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని కోరారు. దీనిపై ఇండస్ట్రీ పెద్దలు సమావేశమై.. నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కోవిడ్ మార్గదర్శకాలతోనే షూటింగ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+