దండోర.. మందు తాగితే అంతే.. పంచాయతీ, పోలీసులు కలిసి..
ఇప్పుడు ఏ చిన్న ఫంక్షన్ అయినా.. లేదంటే సరదాకే యువత మందు మత్తులో మునుగుతుంది. ఇంటి వద్ద, ప్రైవేట్ ప్లేస్‌లో మందు తాగడం లేదు. పబ్లిక్ ప్లేసులో డ్రింక్ చేయడం ఇబ్బంది కరం.. వద్దు అని చెబుతోన్న వినడం లేదు. దీంతో వారికి తగినట్టే ఓ గ్రామ పంచాయతీ దండోరా వేసింది. ఎలా అంటే.. గీత దాటితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది. దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అదీ కాస్త వైరల్‌గా మారింది.

మందు తాగితే
ఇదీ ఎక్కడ జరిగిందో.. ఎప్పుడూ జరిగిందో తెలియదు.. కానీ దండోర వేయించారు. యువత, పిల్లలు, పెద్దవారు అందరూ రాత్రి 9 గంటల తర్వాత మందు తాగొద్దని చెప్పారు. అయితే వారు వారి ప్రైవేట్ ప్లేసులో తాగేందుకు అభ్యంతరం లేదు. కానీ బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం మాత్రం నిషిద్దం. ఒకవేళ అలా తాగితే గ్రామ పంచాయతీ, పోలీసులు కలిసి కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. ఇదీ నిజానికి మంచిదే.. కానీ దానిని ఆచరించేవారు ఎవరూ...? మంచి చెబితే వినేవారు ఎవరు.

దండోరా
ఒకప్పుడు దండోరా వేసేవారు. ఇప్పుడు అంతా మైక్ వాడుతున్నారు. దండోరా వేయించడం మానేశారు. కానీ ఇతను బైక్ మీద తిరుగుతూ మరీ దండోరా తెలియజేశారు. అదీ కూడా యువత మద్యం గురించి చెప్పారు. కొందరు స్కూల్లలో మందు తాగుతూ సీసాలు వేస్తున్నారని తెలియజేశారు. దీంతో పిల్లలకు గుచ్చుకుంటున్నాయి. సేప్టిక్ అయ్యే ప్రమాదం ఉంది. సో పిల్లల గురించి ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు. అలాగే స్కూల్ అంటే దేవాలయంతో సమానం.. ఆలయంతో మందు తాగే సాహసం చేస్తారా.. సో అందుకే పంచాయతీ ఇలా దండోరా వేయించింది.
కేక్ కట్ చేసి
అంతేకాదు కొందరు రోడ్ల మీద కేకులు కట్ చేస్తున్నారు. బర్త్ డే పేరుతో నానా హంగామా చేస్తున్నారు. దీని వల్ల కూడా ఇబ్బంది కలుగుతుందని భావించారు. దానిని కూడా బ్యాన్ చేశారు. అలా తప్పి ప్రవర్తించారో అంతే సంగతులు. సో పంచాయతీ దండోరా ముమ్మాటికీ మంచిదే.. కానీ దానిని ఆచరించే వారు ఎవరో చూడాలీ.. ఆ గ్రామం ఆదర్శ గ్రామంగా మారాలని.. దండోరాతో అయితే యువతలో మార్పు రావాలని కోరుకుందాం..

చాటింపు
ఒకప్పుడు దండోరాతో చాటింపులు చేసేవారు. ఇప్పుడు ఆ సాంప్రదాయం లేనేలేదు. కానీ ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో కొనసాగుతోంది. మంచిదే.. ఇలాంటి ప్రకటనలకు మరింత మంచిది. దీంతో యువత ఏం చేయాలో చేయద్దో ఆలోచిస్తారు. వాస్తవానికి స్కూల్ వద్ద మందు తాగడం.. కేకు కటింగ్ చేసి రచ్చ రచ్చ చేయడం మంచిది కాదు. దాంతో గొడవలు కూడా జరిగేందుకు ఆస్కారం ఉంటుంది. ఈ క్రమంలో ఆ పంచాయతీ చేసిన ప్రకటన మంచిదేననే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

Click it and Unblock the Notifications