వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిషన్ రెడ్డి కాళ్లు పట్టుకొని..కన్నీటి పర్యంతమై: రాజధాని మార్చవద్దంటూ: రైతులకు మంత్రి హామీ..!

|
Google Oneindia TeluguNews

ఏపీ రాజధాని అమరావతి ప్రాంత రైతులు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిని కలిసారు. ఆయన కాళ్లను పట్టుకొని ఉద్వేగానికి లోనయ్యారు. రాజధాని తరలించకుండా చూడాలని ప్రాధేయపడ్డారు. అమరావతి లోనే రాజధాని ఉంచాలంటూ కన్నీటి పర్యంతమయ్యారు. శాసనసభలో మఖ్యమంత్రి మూడు రాజధానుల ప్రకటన సమయం నుండి 18 రోజులుగా ఆందోళన చేస్తున్నా..పట్టించుకోవటం లేదంటూ వాపోయారు.

దీని పైన కిషన రెడ్డి స్పందించారు. రాజకీయ పార్టీలు..ప్రభుత్వవ సమన్వయంతో చర్చించి సమస్య పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తాను రైతులకు సాయం చేస్తానని..వారికి అండగా నిలుస్తానంటూ మంత్రి హామీ ఇచ్చారు. అమరావతిలోనే రాజధాని కొనసాగేలా ప్రయత్నం చేస్తానంటూ కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు.

కేంద్ర మంత్రి కాళ్లు పట్టుకొని..ఉద్వేగానికి గురై

కేంద్ర మంత్రి కాళ్లు పట్టుకొని..ఉద్వేగానికి గురై

అమరావతి ప్రాంతానికి చెందిన రైతులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాళ్లు పట్టుకొని తమ ఆవేదన వెళ్లగక్కారు. కన్నీటి పర్యంమయ్యారు. తమ ఆవేదన వెలిబుచ్చారు. తాము రాజధానుల కోసం భూములు ఇచ్చామ ని..ఇప్పుడు అక్కడి నుండి రాజధాని మారిస్తే తమకు భవిష్యత్ లేదని వాపోయారు. కేంద్ర మంత్రికి జరిగిన వ్యవహారం మొత్తం పైనా వినతి పత్రం ఇచ్చారు. అమరావతిలోనే రాజధాని కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ప్రభుత్వం పట్టించుకోవటం లేదంటూ

ప్రభుత్వం పట్టించుకోవటం లేదంటూ

అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటన చేసిన సమయం నుండి తాము ఆందోళన చేస్తున్నా..ప్రభుత్వం పట్టించుకోవటం లేదంటూ వాపోయారు. ఇప్పటికే తాము రాష్ట్రపతికి కారుణ్య మరణం కోరుతూ లేఖలు రాసామని..అన్ని పార్టీల నేతలకు సమస్య వివరించామని చెప్పుకొచ్చారు. 18 రోజులుగా ఆందోళన చేస్తున్నామని..అధికార పక్షం మినహా అన్ని రాజకీయ పార్టీలు..ప్రజా సంఘాలు..స్థానికంగా జేఏసీలు ఏర్పాటు చేసుకొని తమకు మద్దతుగా నిలుస్తున్నారని కిషన్ రెడ్డికి వివరించారు.

అండగా నిలుస్తామంటూ మంత్రి హామీ..

అండగా నిలుస్తామంటూ మంత్రి హామీ..

అమరావతి ప్రాంత రైతులు..స్థానికుల ఆవేదన పైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. కన్నీటి పర్యంతమైన మహిళలను ఆయన ఓదార్చారు. ఏపీలో ఉద్రిక్త వాతావరణానికి అవకాశం లేకుండా సమస్య పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు..రాజకీయ పార్టీలు, ప్రభుత్వం కూర్చొని రాజధాని సమస్య పరిష్కారం చేసుకోవాలని సూచించారు. అయితే, ప్రభుత్వాన్ని నమ్మి భూములిచ్చిన రైతలకు అన్యాయం జరగకుండా తాను చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

 గతంలోనే కిషన్ రెడ్డి

గతంలోనే కిషన్ రెడ్డి

ఈ విషయం మీద స్పష్టత ఇచ్చారు. రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిదని..దీని పైన బీజేపీ జాతీయ.. రాష్ట్ర స్థాయిలో సమన్వయంతో ఒకే విధానంతో ఉంటాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కోరితే కేంద్రం జోక్యం చేసుకుంటుందని స్పష్టం చేసారు. ఇప్పుడు, రైతుల ఆవేదన చూసిన తరువాత అమరావతి నుండి రాజధాని తరలింపు అంశంపైన పూర్తి సమాచారం తెప్పించుకుంటానని..రైతులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.

English summary
Amaravati Farmers and local women begged Central minister Kishan Reddy and asked him to support them against state govt proposal on capital shifting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X