Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మోహన్ బాబు హెచ్చరిక: ఎవరికి, ఎందుకంటే?

రాజకీయంగా తన పేరును ఉపయోగించుకుంటున్నారని.. అలాంటి చర్యలకు పాల్పడితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు ప్రముఖ సినీనటుడు మంచు మోహన్ బాబు (Mohan Babu). తన పేరును అనవసరంగా వాడితే న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరిస్తూ ట్విట్టర్(ఎక్స్) వేదికగా మోహన్ బాబు ఓ ప్రకటన విడుదల చేశారు.

ఈ మధ్య కాలంలో నా పేరుని రాజకీయంగా కొందరు ఉపయోగించుకుంటున్నట్లుగా నా దృష్టికి వచ్చింది. దయచేసి ఏ పార్టీ వారైనా నా పేరును వారి స్వప్రయోజనాల కోసం వాడుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నా. మనం అనేక రకాల భావావేశాలున్న వ్యక్తుల ప్రపంచంలో జీవిస్తున్నాం. ఎవరి అభిప్రాయాలు వారవి. అది వారి వ్యక్తిగతం అని మోహన్ బాబు వ్యాఖ్యానించారు.

చేతనైతే నలుగురికి సాయపడటంలోనే మనం దృష్టి పెట్టాలిగానీ.. సంబంధం లేని వారిని రాజకీయ పార్టీల్లోకి, వారి అనుబంధ సంస్థల్లోకి తీసుకురావడం బాధాకరం. నాకు అండదండగా ఉన్న ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేస్తూ.. శాంతి సౌభ్రాతృత్వాలను వ్యాపింపజేయడంలో అందరం బద్ధులై ఉందామని కోరుకుంటూ, ఉల్లంఘించినవారిపై న్యాయపరమైన చర్యలు తాసుకుంటానని హెచ్చరిస్తూ.. ధన్యవాదాలతో మీ మోహన్ బాబు అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

అయితే, మోహన్ బాబు పేరును ఎవరు వాడుకున్నారనేది చర్చనీయాంశంగా మారింది. ఆయన పేరును వాడుకుని రాజకీయాలు చేసేంత అవసరం ఎవరికుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌‌సభ ఎన్నికలు త్వరలో జరగనున్న సమయంలో మోహన్ బాబు ప్రకటన చర్చనీయాంశమైంది.

Dont use my name in political gains: Mohan Babu warning

ఇది ఇలావుండగా, మోహన్ బాబు తన కుమారుడు మంచు విష్ణుతో కలిసి 'కన్నప్ప'లో నటిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రానికి ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. రూ. 100 కోట్ల భారీ బడ్జెట్ తో అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సినిమాను తెరకెక్కిస్తుండటం గమనార్హం. విష్ణు శివభక్తుడి పాత్రలో నటిస్తుండగా.. ప్రముఖ నటులు ప్రభాస్, మోహన్ లాల్ కీలక పాత్రలను పోషిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+