మీ జాతకాలున్నాయ్..జాగ్రత్త!.. మారకపోతే మార్చేస్తా: బాబు సంచలనం

ఎవరి పరిస్థితి ఏమిటో నాకు తెలుసు. మీ బలాలు, బలహీనతలు ఏమిటో, ప్రజల్లో ఉన్న పలుకుబడి అన్నింటిపైనా నా వద్ద సమాచారం ఉంది. సరిచేసుకోవాల్సిన అంశాలపై ఇంతకుముందే వ్యక్తిగతంగా రిపోర్టులు ఇచ్చాం.

అమరావతి:ఎవరి పరిస్థితి ఏమిటో నాకు తెలుసు. మీ బలాలు, బలహీనతలు ఏమిటో, ప్రజల్లో ఉన్న పలుకుబడి అన్నింటిపైనా నా వద్ద సమాచారం ఉంది. సరిచేసుకోవాల్సిన అంశాలపై ఇంతకుముందే వ్యక్తిగతంగా రిపోర్టులు ఇచ్చాం. సరిచేసుకోకపోతే తానే వారిని మార్చేస్తానని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు హెచ్చరించారు.

టిడిపి రాష్ట్రస్థాయి వర్క్ షాప్ విజయవాడలో మంగళవారం నాడు అమరావతిలో నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులకు బాబు తీవ్ర హెచ్చరికలు చేశారు. పద్దతిని మార్చుకోవాలని ఆయన నేతలకు సూచించారు. లేకపోతే తాను వారిని మార్చేస్తానని ఆయన కటువుగానే చెప్పారు.

పార్టీ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించడం వల్ల ఎదురౌతున్న ఇబ్బందులను ఆయన ప్రస్తావించారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ కొందరు నేతలు వ్యవహరిస్తున్న తీరుతో ప్రత్యర్థులకు వరంగా మారుతున్న అంశాలను ఆయన ప్రస్తావించారు.

ప్రభుత్వం ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్న వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వైఫల్యం చెందుతున్నామనే అభిప్రాయాన్ని బాబు వ్యక్తం చేశారు.

నాకేం ఢోకాలేదనుకోవద్దు

నాకేం ఢోకాలేదనుకోవద్దు

నియోజకవర్గం బాగుందనే ధీమా వద్దు. నాకేం ఢోకా లేదనుకోవద్దు. మీలో ఎవరి పరిస్థితి ఏమిటో నాకు తెలుసు. మీ బలాలు, బలహీనతలు, ప్రజల్లో పలుకుబడి అన్నింటిపై తన వద్ద సమాచారం ఉందని బాబు పార్టీ వర్క్ షాప్ లో చెప్పారు. సెప్టెంబర్ లో నిర్వహించే ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నాటికి పరిస్థితిలో మార్పులు రావాలని ఆయన సూచించారు. మార్పులు రానివారిని తాను మార్చేస్తానని బాబు హెచ్చరించారు.

ప్రతిపక్షం బలహీనంగా ఉంది

ప్రతిపక్షం బలహీనంగా ఉంది

రాష్ట్రంలో ప్రతిపక్షం బలహీనంగా ఉందని ఉదాసీనంగా ఉండకూడదని ఆయన పార్టీ ప్రజాప్రతినిధులకు సూచించారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా మనమే గెలుస్తామని సర్వేలు చెబుతున్నాయన్నారు. వైసీపీ ఎంతవరకు ఉంటుందనేది అనుమానమేనన్నారు. చేసిన తప్పుల నుండి జగన్ బయటపడడం కష్టమేనని చెప్పారు.అయితే రాష్ట్రంలోని 80 శాతం ప్రజల మద్దతును పొందాల్సిన అవసరం ఉందని బాబు అభిప్రాయపడ్డారు. ఈ విషయమై ఓటర్ల మద్దతు కాదు, ప్రజల మద్దతు పొందాల్సిన అవసరం ఉందన్నారు.

మారకపోతే మార్చేస్తా

మారకపోతే మార్చేస్తా

తప్పులు చేస్తూ పోతే తప్పించడం ఖాయమన్నారు. అయితే మారేందుకు ఒక్క అవకాశం ఇస్తానని చెప్పారు. లేదంటే మిమ్మల్నే మార్చేస్తానని చెప్పారు. ప్రజలతో సన్నిహిత సంబంధాలను ఏర్పాటుచేసుకోవాలన్నారు. ప్రజల్లో మంచి పేరు లేకపోతే కష్టమేనని చెప్పారు. అందరి జాతకాలు తన వద్ద ఉన్నాయని బాబు చెప్పారు. పార్టీ సూచనల మేరకు పనిచేయాలని బాబు సూచించారు. పార్టీ కమిటీలనుపూర్తి చేయాలని ఆయన సూచించారు.

భాష మార్చుకోవాలి

భాష మార్చుకోవాలి

మీ భాష మారాల్సిందేనని చంద్రబాబునాయుడు చెప్పారు. దేహ భాష కూడ మార్పు చేసుకోవాలని ఆయన సూచించారు. మంచి ఉద్దేశ్యంతో చెప్పినా ఒక్కో మాటను వక్రీకరించి సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తున్నారని చంద్రబాబునాయుడు అన్నారు. ఎక్సైజ్ మంత్రి జవహర్ బీరుపై చేసిన కామెంట్ ను ఆయన ప్రస్తావించారు. ఒక్కమాట పొరపాటుగా మాట్లాడినా మొత్తంగా పార్టీపై ప్రభావం ఉంటుందన్నారు. మాట్లాడే విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. సెప్టెంబర్ 1వ, తేది నుండి ఇంటింటికి టిడిపి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు చెప్పారు బాబు. అంతకుమందే ఈ నెల 10 నుండి బూత్ స్థాయి కమిటీలపై దృష్టి పెట్టాలన్నారు. 10వ, తేది నుండి ఆగష్టు వరకు గ్రామస్థాయి నేతలకు శిక్షణ ఇవ్వనున్నట్టు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+