పవన్ విజ్ఞప్తికి కేంద్రం ఓకే..!!

Pawan Kalyan: కేంద్ర ప్రభుత్వం వద్ద తనకు ఉన్న పట్టును మరోసారి నిరూపించుకుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం. తన డిమాండ్‌ను నెరవేర్చుకుంది. కేరళ క్యాడర్‌కు చెందిన తెలుగు ఐఏఎస్‌ అధికారి మైలవరపు కృష్ణతేజను ఏపీకి రప్పించుకోగలిగింది.

ప్రస్తుతం త్రిశూర్ జిల్లా కలెక్టర్‌గా ఉన్న కృష్ణతేజ డెప్యూటేషన్‌పై ఏపీకి వెళ్లడానికి డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ అంగీకరించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై ఆమోదముద్ర వేసింది. ఆయనకు పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది.

DoPT agress to Kerala IAS officer Krishna Teja Mylavarapu allocate to AP on deputation

ఈ శాఖ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆధీనంలో ఉంది. పంచాయతీ రాజ్‌తో పాటు గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలు ఆయన వద్దే ఉన్నాయి. ఆయా శాఖలన్నీ కూడా కీలకమైనవే. ఈ నేపథ్యంలో పంచాయతీ రాజ్ శాఖ బాధ్యతలను కృష్ణతేజకు అప్పగిస్తారని తెలుస్తోంది.

గుంటూరు జిల్లాకు చెందిన కృష్ణ తేజ మైలవరపు 2015 బ్యాచ్‌కు చెందిన కేరళ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. అంతకు ముందు అలప్పుజ డిప్యూటీ కలెక్టర్‌గా, కేరళ పర్యాటకాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెెక్టర్‌గా పని చేశారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధిపై ఆయనకు గట్టిపట్టు ఉన్నట్లు చెబుతున్నారు.

ఈ క్రమంలోనే ఆయనను ఏపీకి రప్పించినట్లు తెలుస్తోంది. పంచాయతీ రాజ్ శాఖతో పాటు పవన్ కల్యాణ్ వద్ద ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా కృష్ణ తేజ అపాయింట్ అవ్వొచ్చు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్‌ ప్రసాద్‌కు రెండు మూడు రోజుల్లో రిపోర్ట్ చేయనున్నారు. ఆ వెంటనే ఆయన నియామకానికి సంబంధించిన జీఓ వెలువడుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+