మోడీ సంచలనం: నోట్లను ఎలా మార్చుకోవచ్చు?
ఈ రోజు నుండి రూ.500/- (ఐదు వందల రూపాయల నోటు) రూ.1000 (వెయ్యి రూపాయల నోటు) చెలామణిలో నుండి భారత ప్రభుత్వము తీసివేశారు. కానీ నోట్ల విలువ తీసివెయ్యలేదు. కానీ కొందరు ఈ నోట్లు చెల్లవు అని ప్రచారం చేస్తున్నారు. ఇవి పుకార్లు మాత్రమే ..డిసెంబరు ౩౦ వ తారీఖు దాకా ఈ నోట్లు బ్యాంకులలొ ఇచ్చి కొత్త నోట్లుగా మార్చుకోవచ్చు. మరోసారి గమనించండి. నోటు చెలామణిలో కొద్దిగా మార్పు చేశారు కానీ.. ఈ నోట్ల విలువను ఏమీ మార్చలేదు. జాతీయ స్థాయి మీడియాలు సైతం తెలిసీ, తెలవక ఆసత్యలు ప్రచారం చేయడంతో గత రాత్రి కొంత మేర ప్రజలు ఇబ్బందులకు గురైయ్యారు. కానీ సామాన్య ప్రజలకు వచ్చిన నష్టం మాత్రం ఎమీలేదు.. అయితే కోట్ల కొద్దీ నల్ల డబ్బు ఉన్న వారి గురించి ప్రభుత్వమే చూసుకుంటుంది..
ఇబ్బందులు పడితే, మంచాన పడితే.. వాళ్లే పడతారు. కానీ సామాన్యులకు మాత్రం వచ్చిన నష్టం ఎమీలేదు...కాకుంటే బుధవారం ఒక్క రోజు కొంత మేర ఇబ్బంది ఉంటుంది. భారతదేశ భవిష్యత్తు కొసం ఈ ఒక్క రోజు సామాన్యుడు ఇబ్బందులు పడక తప్పదు. అదీ నిత్యవసర వస్తువులు..పెట్రోలు బంక్ లు.. ప్రయాణాలు.. ఆస్పత్రి వంటి వాటిలో మాత్రం కాదు.. అక్కడ మాత్రం మీ వద్ద ఉన్న సోమ్మును వాడుకోవచ్చు
అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి... మీ సోమ్ము బ్యాంకులో ఉంటే..అటోమేటిక్ గా గురువారం నుంచి మీకు కొత్త నోట్లే వస్తాయి. అలాగే డబ్బు ఇంట్లో ఉంటే మాత్రం గురువారం ఉదయం బ్యాంకుకు గానీ, పోస్టాఫీసుకు గానీ వెళ్లి మీ ఆకౌంట్ లో వెసుకొని.. ఏటీంఎంల ద్వారా భారత ప్రభుత్వం చెలామణిలోకి తెచ్చిన నోట్లును తీసుకొని వాడుకోవచ్చు. మీ కు బ్యాంకులో ఆకౌంట్ లేకపోతే.. మీ అధార్..కార్డ్, రెండు పాస్ పోర్ట్ ఫోటోలు, తీసుకొని వెళ్లి నూతన ఆకౌంట్ తెరుచుకోని దానిలో డబ్బును వెసుకోవచ్చు.
మీరు ఈ నోట్లు పొరపాటున కూడా ఏ భయంతోను, నాశనం చేసుకోవద్దు తక్కువకి ఎవరికీ ఇవ్వవద్దు. ఈ విషయాన్ని తోటి వారికి కూడా చెప్పండి. నోట్లు మనం మార్చుకోవటంలో కాస్త ఇబ్బంది ఉండవచ్చు. అదే ప్రజలు చేయవలసిన త్యాగం. నిజానికి ఇది త్యాగం కాదు. ప్రజల బాధ్యత. సరైన అవగాహనతో నడవండి... తెలియని వారికి తెలియ చెప్పి, మీ కర్తవ్యం నెరవేర్చండి.
-
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications