ఎవరీ Dr దిన్షా పార్దివాలా - చికిత్స కోసం పవన్ ఎంపిక వెనుక..!!
డాక్టర్ దిన్షా పార్దివాలా. కొద్ది రోజులుగా బాగా ప్రచారం జరుగుతున్న పేరు. తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కు ముంబాయిలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో విజయవంతంగా భుజానికి శస్త్రచికిత్స చేసిన వైద్యుడు. అయితే, పవన్ ఇక్కడే సర్జరీ చేయించుకోవాలనే నిర్ణయం వెనుక కీలక అంశాలు ఉన్నాయి. ఇప్పుడు పవన్ కు చేసిన ఈ వైద్యుడు టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తర్వాత మోకాలికి క్లిష్టమైన శస్త్రచికిత్స చేసారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కు భుజం సర్జరీ చేసిన వైద్యుడి గురించి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చర్చ సాగుతోంది.ఈ ఆపరేషన్‌ను ప్రపంచ ప్రఖ్యాత ఆర్థోపెడిక్ మరియు స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణుడు డాక్టర్ దిన్షా పార్దివాలా నేతృత్వంలోని వైద్య బృందం నిర్వహించింది. భుజం, మోకాలు, లిగమెంట్ గాయాలకు అత్యాధునిక శస్త్రచికిత్సలు చేయడంలో డాక్టర్ దిన్షా పార్దివాలా కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది.

వైద్య రంగంలో దాదాపు 27 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన డాక్టర్ పార్దివాలా ఇప్పటివరకు 10 వేలకుపైగా శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయ. ముఖ్యంగా ఆయన చేసిన సర్జరీల్లో ఇన్‌ఫెక్షన్ రేటు దాదాపు శూన్యంగా ఉండటం ప్రత్యేకత. ఆ తర్వాత అమెరికాలోని హాస్పిటల్ ఫర్ స్పెషల్ సర్జరీ (న్యూయార్క్), అమెరికన్ స్పోర్ట్స్ మెడిసిన్ ఇన్‌స్టిట్యూట్ (అలబామా) లో ఆర్థ్రోస్కోపీ, స్పోర్ట్స్ ఆర్థోపెడిక్స్‌లో ప్రత్యేక శిక్షణ పొందారు.
అంతర్జాతీయ స్థాయి గుర్తింపు
అదే విధంగా డాక్టర్ దిన్షా పార్దివాలా యూకేలోని ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్ వైద్య సంస్థల్లో హిప్ ఆర్థ్రోస్కోపీపై అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ పూర్తి చేశారు. ICC (అంతర్జాతీయ క్రికెట్ మండలి) లో భారత ప్రతినిధిగా సేవలందిస్తున్నారు. గతంలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ కు క్లిష్టమైన శస్త్రచికిత్స చేసినది కూడా డాక్టర్ పార్దివాలానే.

అలాగే ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా, స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగాట్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణులు సైనా నెహ్వాల్, పీ.వి. సింధు, రెజ్లర్ సుశీల్ కుమార్ వంటి పలువురు ప్రముఖ క్రీడాకారులకు చికిత్స అందించారు. దేశంలో తొలి రివర్స్ టోటల్ షోల్డర్ రీప్లేస్‌మెంట్, తొలి స్టెమ్ సెల్ ఇంప్లాంట్, తొలి నేవిగేషన్ గైడెడ్ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ వంటి వినూత్న శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించిన రికార్డు ఆయన పేరు మీదే ఉంది. దీంతో.. ఇంత నైపుణ్యం ఉన్న డాక్టర్ దిన్షా పార్దివాలా వద్ద చికిత్స కోసం పవన్ నిర్ణయించారు.













Click it and Unblock the Notifications