అమరావతి డిజైన్ల వెనుక మంత్రి నారాయణ కీలకపాత్ర
అమరావతి: ఏపీ రాజధాని అమరావతి డిజైన్లలో రాష్ట్ర మంత్రి నారాయణ కీలకంగా వ్యవహరించారు. అమరావతిని ప్రపంచ ప్రసిద్ద నగరాల్లో జాబితాలో చేరేలా డిజైన్ల తయారీలో నారాయణ కీలకంగా వ్యవహరించారని టిడిపి నేతలు చెబుతుంటారు.
Recommended Video

ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ విద్యాసంస్థల అధినేత ఎం నారాయణ. తొలి నుంచి తెలుగుదేశం పార్టీకి సన్నిహితంగా వ్యవహరించారు. 2014 ఎన్నికల్లో ఆ పార్టీ విజయానికి తెర వెనుక వ్యూహాలు అమలు చేశారని ప్రతీతి.

2014లో ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ, శాసనమండలిలో సభ్యులు కాకున్నా రాష్ట్ర మున్సిపల్ మంత్రిగా ప్రమాణం చేశారు. తర్వాత 'అమరావతి'లో రాజధాని నగర నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. విదేశీ సంస్థలతో సంప్రదింపుల్లోనూ ప్రధాన భూమిక పోషిస్తున్నారు.
రాజధాని డిజైన్లను ఇటీవలనే ఏపీ ప్రభుత్వం ఫైనల్ చేసింది. అయితే ఈ డిజైన్ల ఎంపిక కోసం నారాయణ తీవ్రంగా శ్రమించారు. ఈ డిజైన్ల తయారీలో సినీ దర్శకుడు రాజమౌళి సహకారం కూడ తీసుకొన్నారు.
ఈ డిజైన్ల పరిశీలన కోసం లండన్ పర్యటనలో ఉన్న సమయంలో మంత్రి నారాయణ కొడుకు నిశిత్ రోడ్డు ప్రమాదంలో మరణించారు.ఈ విషయం తెలిసిన వెంటనే మంత్రి లండన్ నుండి తిరిగి వచ్చారు. అయితే కొడుకు మరణించిన రెండు వారాలకే నారాయణ మళ్ళీ డిజైన్ల పనుల్లో బిజీ అయ్యారు.












Click it and Unblock the Notifications