విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డాక్టర్ సుధాకర్ సంచలన వాగ్మూలం.. లేడీ కానిస్టేబుల్‌తో అలా చేయించి.. అర్ధనగ్నంగా మార్చారంటూ..

|
Google Oneindia TeluguNews

ఎన్-95 మాస్కుల వివాదంలో సస్పెన్షన్‌కు గురైన నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ రావు వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకువిశాఖ మెజిస్ట్రేట్.. శనివారం రాత్రి కీలక వాగ్మూలాన్ని రికార్డు చేశారు. అందులో డాక్టర్ సుధాకర్ పలు సంచలన విషయాలను వెల్లడించారు. డాక్టర్ ను అరెస్టు చేసిన ఘటనలో విశాఖపట్నం పోలీసుల తీరును తప్పుపట్టిన హైకోర్టు.. విచారణను సీబీఐకి బదిలీచేయడం, 8 వారాల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించడం తెలిసిందే.

కరోనా లాక్‌డౌన్: జగన్ మరో సంచలనం.. ఆ తప్పులకు విచారణ లేదు.. జరిమానా, వ్యక్తిగత హామీతో సరి..కరోనా లాక్‌డౌన్: జగన్ మరో సంచలనం.. ఆ తప్పులకు విచారణ లేదు.. జరిమానా, వ్యక్తిగత హామీతో సరి..

స్టేట్మెంట్‌లో ఏముందంటే..

స్టేట్మెంట్‌లో ఏముందంటే..

మాస్కుల కొరతపై తాను ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందనే అంశం మొదలుకొని.. ఏప్రిల్ 8న అంబులెన్స్ డ్రైవర్ ద్వారా సస్పెన్షన్ ఉత్తర్వులు అందుకోవడం.. అదే నెల 20న వైజాగ్ 4టౌన్ పోలీస్ స్టేషన్ లో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలు, చివరికి ఈనెల 16న నడిరోడ్డుపై పోలీసులు అరెస్టు చేసిన తీరు దాకా అన్ని వివరాలను ఆయన పూసగుచ్చినట్లు మెజిస్ట్రేట్ కు వివరించారు. డాక్టర్ అరెస్టుపై టీడీపీ మహిళా నేత, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత రాసిన లేఖను హైకోర్టు సుమోటోగా స్వీకరించి విచారిస్తున్న క్రమంలో స్టేట్మెంట్ రికార్డునకు ఆదేశించింది.

డ్రైవర్ రాముతో పంపారు..

డ్రైవర్ రాముతో పంపారు..

నర్సీపట్నం ఆర్డీవో.. ఏరియా ఆస్పత్రిని సందర్శించిన సందర్భంలో మొదటిసారి తాను మాస్కుల గురించి అడిగానని డాక్టర్ సుధాకర్ చెప్పారు. అనస్థీషియనిస్టువు కాబట్టి మాస్కు అవసరం లేదని ఆర్డీవో సమాధానమిచ్చారని, ఏప్రిల్ 6న ఓ రోగికి చికిత్స అందించే క్రమంలో మళ్లీ అడగ్గా, ఆస్పత్రి ఫార్మసిస్టు.. ఒక మాస్కును చేతిలో పెట్టి దాన్నే 15 రోజులు వాడాలని చెప్పారని, దాంతో ఆస్పత్రిలో సౌకర్యాల లేమిపై వీడియో చేశానని ఆయన తెలిపారు. సదరు వీడియోను ముందుగా ఆస్పత్రి కమిటీ చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే గణేశ్ కు చూపాలనుకున్నా కుదరలేదని, కమిటీ మాజీ చైర్మన్ అయ్యన్నపాత్రుడిని కలవడం కూడా కుదరలేదని, అదే సమయానికి ఆర్డీవో, స్థానిక ఎమ్మెల్యే మున్సిపల్ కార్యాలయంలో ఉన్నారని తెలిసి వెళ్లగా.. ఆ ఇద్దరూ తనను దుర్భాషలాడి అక్కణ్నుంచి వెల్లగొట్టారని, ఆ తర్వాత వీడియో మీడియాలో వైరల్ కావడంతో ఏప్రిల్ 8న అంబులెన్స్ డ్రైవర్ రాముతో సస్పెన్షన్ ఆర్డర్ పంపారని వివరించారు. ఆ తర్వాత..

కొడుకు బండి కోసం వెళితే..

కొడుకు బండి కోసం వెళితే..

‘‘నేను సస్పెన్షన్ టెన్షన్ లో ఉండగానే.. స్కోడా కారులో వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు.. నా కొడుకు బైక్ ను సీజ్ చేసి తీసుకెళ్లారు. అసలేం జరిగిందో తెలుసుకునేందుకు నేను 4వటౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లాను. అక్కడ అనూహ్య రీతిలో.. ఓ లేడీ కానిస్టేబుల్ నా చెయ్యి గట్టిగా పట్టుకుని.. రివర్స్ లో నేనేదో చేసినట్లు ‘వదిలిపెట్టండీ..'అని ఏడ్చింది. మరుక్షణంలోనే పోలీసులు నన్ను చుట్టుముట్టి విపరీతంగా కొట్టారు. ఈ కేసుతో సస్పెన్షన్ కాదు.. ఏకంగా డిస్మిస్ చేయిస్తామని బెదిరించి, విడిచిపెట్టారు..''అని డాక్టర్ సుధాకర్ తన వాగ్మూలంలో పేర్కొన్నారు. మళ్లీ కొద్దిరోజులకే..

పోలీసులే రెచ్చగొట్టారు..

పోలీసులే రెచ్చగొట్టారు..

సస్పెన్షన్, అనంతర పరిణామాలతో కుంగిపోయిన తనను పోలీసులు కావాలనే రెచ్చగొట్టి, చితకబాది, పిచ్చివాడిగా ముద్రవేశారని డాక్టర్ సుధాకర్ చెప్పుకొచ్చారు. ‘‘నా దగ్గరున్న రూ.10 లక్షలను బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు మే 16న అనకాపల్లి బయలుదేరాను. బైక్ పై ఇద్దరు వ్యక్తులు నన్ను ఫాలో అవుతున్నట్లు అర్థమై, కారును వెనక్కి తిప్పి, పోర్టు ఆస్పత్రి వద్ద మూత్ర విసర్జన కోసం ఆగాను. హఠాత్తుగా ఇద్దరు ట్రాఫిక్ పోలీసులు వచ్చి.. నా సస్పెన్షన్, ఇతర అంశాలపై రెచ్చగొడుతూ మాట్లాడారు. ఎందుకిలా చేస్తున్నారని ప్రశ్నించేలోపే నా సెల్ ఫోన్, ఏటీఎం కార్డులున్న పర్సు, కారు తాళాలు లాగేసుకుని నన్ను అర్థనగ్నంగా మార్చేసి, లాఠీలు, బూట్లతో కొట్టారు. కారులో ఉన్న రూ.10 లక్షలు తీసుకుని, ముందు సీటులో మూడు విస్కీ బాటిళ్లు పెట్టించినట్లు తర్వాత అర్థమైంది. పిచ్చివాడని, మద్యం సేవించాడని నాపై ముద్రవేసి, ముందుగా 4వ టౌన్ స్టేషన్ కు తీసుకెళ్లారు. చేతులు వెనక్కి కట్టేసి, రెండు గంటలపాటు నేలపై పడేశారు. ఆ తర్వాత మెంటల్ ఆస్పత్రిలో చేర్పించారు..''అని సుధాకర్ తన వాగ్మూలంలో కు తెలిపారు.

Recommended Video

VizagGasLeak: Venkatapuram Villagers Dharna At LG Polymers Demanding Job for Every Family in Village
గాయాలను పేర్కొన్న మెజిస్ట్రేట్

గాయాలను పేర్కొన్న మెజిస్ట్రేట్

ప్రస్తుతం వైజాగ్ మెంటల్ ఆస్పత్రిలో ఉన్న డాక్టర్ సుధాకర్ నుంచి వాంగ్మూలం తీసుకున్న మెజిస్ట్రేట్.. ఆయన శరీరంపై ఉన్న గాయాలను కూడా రిపోర్టులో పేర్కొన్నారు. డాక్టర్ ఎడమ కంటికి దిగువన, ఎడమ కాలు బొటనవేలు వద్ద గాయాలు కమలిపోయి ఉన్నాయని, ఎడమ చేయి మధ్య వేలు, చూపుడు వేలు మధ్యలో మరో గాయం, కుడి తొడ వెనక సుమారు అరచేయంత మందంలో కమిలిపోయిన గుర్తులు, ఎడమ మోచేయి, కుడి ముంజేతిపై గోటితో గిచ్చిన ఆనవాళ్లు ఉన్నట్టు మెజిస్ట్రేట్ గుర్తించారు.

English summary
suspended vizag doctor sudhakar rao gave sensational statement to Visakhapatnam Magistrate. he alleged that police were conspired him. as per ap high court order vizag Magistrate Records doctor sudhakar statement
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X