రాజమండ్రి ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత
తూర్పుగోదావరి:రాజమండ్రి విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని డీఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు. ఓ అగంతకుడు 1.9 కిలోల బంగారాన్ని పేస్ట్ రూపంలోకి మార్చి హైదరాబాద్ కి తరలించే క్రమంలో రాజమండ్రి తెచ్చినట్లు డిఆర్ఐ అధికారులు గుర్తించారు.
ఈ వ్యక్తే బంగారాన్ని ఈ విధంగా పేస్ట్ రూపంలో తయారుచేసి కొలంబో నుంచి మధురై మీదుగా హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు అధికారులకు సమాచారం వచ్చినట్లు తెలిసింది. దీంతో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి ఎట్టకేలకు ఆ స్మగ్లర్ ను పట్టుకున్నారు. అనంతరం బంగారంతో పాటు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్న బంగారం విలువ సుమారు రూ.40 లక్షలు ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

ఇదిలావుంటే
చిట్టీల పేరుతో కోట్ల రూపాయాలకు స్థానికులకు శఠగోపం పెట్టిన చిట్టీల వ్యాపారి ఉదంతం ఇది. ఈ ఘటన ప్రకాశం జిల్లా దర్శి మండలం శివరాజ్‌నగర్ లో చోటుచేసుకుంది. చిన్న మాంతయ్య అనే చిట్టీల వ్యాపారి సుమారుగా రూ. మూడు కోట్లతో ఉడాయించినట్లు తెలిసింది. చిట్టీలు పాడించి, ఆ తరువాత ఆ మొత్తాన్ని వడ్డీకి అప్పుగా తీసుకున్న చిన్న మాంతయ్య ఎవరికీ చిల్లిగవ్వ ఇవ్వకుండా ఇలా రాత్రికి రాత్రే పరారయ్యాడు.
దీంతో బాధితులు లబోదిబో మంటూ రోడ్డెక్కగా...మీ సొమ్ముకు మేము బాధ్యులం...ఎవరూ కంగారుపడాల్సిన పనిలేదని చిన మాంతయ్య సోదరులు మొదట హామీ ఇచ్చారు. ఆ తరువాత ఏం జరిగిందో గానీ ఈ వ్యవహారంతో తమకు సంబంధంలేదని, అంత డబ్బులు తిరిగి ఇవ్వడం తమ వల్ల కాదని చేతులెత్తేశారు. దీంతో మాంతయ్య ఇంటి ఎదుట బాధితులు ఆందోళనకు దిగారు.
అయితే చిన మాంతయ్య ఈ విధంగా మోసగించేందుకు గత కొన్ని నెలలుగా పక్కా పథకం ప్రకారం సిద్దమవుతూ వచ్చాడని, అందులో భాగంగానే ఆయన తన ఆస్తులను అమ్మేశాడు...తాజాగా తన ఇంటిపై కూడా ఫైనాన్స్ తీసుకుని ఈ మొత్తం సొమ్ముతో ఉడాయించా. దీంతో బాధితులు పోలీసులకు పిర్యాదు చేయగా వారు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం బాధితులు తమను ఆదుకోవాలంటూ మంత్రి శిద్ధా రాఘవరావుకు వినతి పత్రం ఇచ్చారు.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications