వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మద్యం కొనుగోలుకు అప్పులిప్పించాలని చంద్రబాబును కోరిన తాగుబోతు

By Pratap
|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఓ తాగుబోతు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి చేసిన విజ్ఞప్తికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. తాగుబోతులందరి తరఫున అతను ఆ విజ్ఞప్తి చేశాడు. ఈ వీడియోను సోషల్ మీడియా యూజర్స్ నవ్వులాటగా తీసుకుంటున్నారు.

కృష్ణా జిల్లా పెడనకు చెందిన పి. ఏసుపాదం అనే వ్యక్తి తనను తాను చంద్రబాబుకు వీరాభిమానిగా చెప్పుకున్నాడు. తమను నిర్లక్ష్యానికి గురిచేస్తున్నారంటూ ఆర్థిక సహాయం అర్థిస్తూ వీడియోను రూపొందించాడు. ఆ వీడియోను అతని మిత్రులు ఆదివారంనాడు ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశారు.

Drunkard seeks loan from AP CM Naidu to buy liquor

ఏసుపాదం ఆ వీడియోలో తనను తాను పరిచయం చేసుకుని తాగుడు వ్యసనం వల్ల, మద్యం కొనడానికి డబ్బులు లేకపోవడం వల్ల ఎదురవుతున్న కష్టాలను ఏకరువు పెట్టాడు. మద్యం లేకపోతే తాను స్థిరంగా నిలబడలేనని, తనలాంటివాళ్లు చాలా మంది ఉన్నారని, తమకు ప్రభుత్వం అప్పులు ఇచ్చి, ఇతర ప్రయోజనాలు కలిగిస్తే కృతజ్ఞతాబద్దులమై ఉంటామని చెప్పాడు.

నెలకు 400 రూపాయల అప్పు ఇవ్వాలని, చాలా పార్టీలు వచ్చాయి గానీ లిక్కర్ పార్టీ రాలేదని, తాను నేరుగా కలువలేను కాబట్టి ఈ మీడియమ్‌ను వాడుకుంటున్నాని ఏసుపాదం చెప్పాడు. అతను నవ్వులాట కోసం ఇది రూపొందించాడనే ఉద్దేశంతో సోషల్ మీడియా యూజర్స్ దాన్ని ఆ విధంగానే తీసుకుంటున్నారు.

English summary
A video of an inebriated person in Krishna district making an appeal to Chief Minister N. Chandrababu Naidu on behalf of drunks has gone viral on social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X