మద్యం మత్తులో కొడుకును చంపిన తండ్రి (ఫొటోలు)

విశాఖపట్నం: విశాఖ జిల్లా పెదవాల్తేర్‌ రామలక్ష్మి అపార్ట్‌మెంట్స్‌ సమీపంలో సోమవారం మద్యం మత్తులో ఓ తండ్రి కన్నకొడుకునే కడతేర్చాడు. తాపీ పనిచేసే శెట్టిబలిజ వీధికి చెందిన అగురు నూకరాజుకు ఇద్దరు కుమారులు.

మద్యానికి బానిసైన నూకరాజు ప్రతిరోజు భార్యాపిల్లలను హింసిస్తుండగా అతని భార్య కూలిపని, పాచిపనులు చేసి కుటుంబాన్ని పోషిస్తున్నది. రోజులాగే సోమవారం ఉదయం నుంచే మద్యం తాగి ఉన్న నూకరాజు మధ్యాహ్నం తాగుడు కోసం ఇంట్లోని వస్తువులను పట్టుకుని వెళ్లడానికి పూనుకున్నాడు.

దీంతో భార్య, పెద్ద కుమారుడు సాయికుమార్‌ (14) అడ్డుకోగా వారి ఘర్షణ జరిగింది. భార్యను తన్ని దూరంగా తోసేశాడు. కొడుకు అడ్డుతప్పుకోకపోవడంతో దగ్గర్లో వున్న చాకు తీసుకుని అతడి పొట్టలో మూడుసార్లు పొడిచాడు. దాంతో కుమారుడు మృతి చెందాడు.

చుట్టుపక్కల వారి ఫిర్యాదుతో ఎంవీపీ జోన్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందతుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని కేజీహెచ్‌ మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కన్న కొడుకును చంపిన తండ్రి

కన్న కొడుకును చంపిన తండ్రి

మద్యం మత్తులో ఓ తండ్రి కన్న కుమారుడినే హత్య చేశాడు. సోమవారంనాడు ఈ సంఘటన జరిగింది.

కన్న కొడుకును చంపిన తండ్రి

కన్న కొడుకును చంపిన తండ్రి

కన్న కుమారుడిని తండ్రి హత్య చేసిన సంఘటన విశాఖపట్నం జిల్లాలో జరిగింది. ఈ సంఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.

కన్న కొడుకును చంపిన తండ్రి

కన్న కొడుకును చంపిన తండ్రి

కన్న తండ్రి కత్తితో పొడవడంతో గాయపడిన సాయికుమార్‌ను కెజిహెచ్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే తనువు చాలించాడు.

కన్న కొడుకును చంపిన తండ్రి

కన్న కొడుకును చంపిన తండ్రి

ఏడో తరగతి చదివి కుటుంబం కోసం చదువు వదిలేసి ఇంటి కోసం కష్టపడుతున్న సాయికుమార్ మృతి స్థానికులను కంట తడి పెట్టించింది.

కన్న కొడుకును చంపిన తండ్రి

కన్న కొడుకును చంపిన తండ్రి

పారిపోవడానికి ప్రయత్నించిన సాయికుమార్ తండ్రి నూకరాజును స్థానికులు పట్టుకుని బంధించారు. అతని తీరును తీవ్రంగా నిరసించారు.

కన్న కొడుకును చంపిన తండ్రి

కన్న కొడుకును చంపిన తండ్రి

కళ్ల ముందే కన్న కుమారుడు హత్యకు గురి కావడంతో తల్లి హృదయవిదారకంగా రోదించింది. అన్న మృతి చెందాడని తెలిసి తమ్ముడు గుండలవిసేలా రోదించాడు.

కన్న కొడుకును చంపిన తండ్రి

కన్న కొడుకును చంపిన తండ్రి

డిసిపి శ్రీనివాసులు సాయికుమార్ తల్లి లక్ష్మితో మాట్లాడి సంఘటనకు సంబంధించిన విషయాలను ఆరా తీశారు. సిఐ విద్యాసాగర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

కన్నకొడుకును చంపిన తండ్రి

కన్నకొడుకును చంపిన తండ్రి

తండ్రి చేతిలో సాయికుమార్ మరణించడం స్థానికులకు తీవ్ర ఆవేదనకు గురి చేసింది. తల్లి గుండెలు అవిసేలా రోదించింది.

భార్యపై అనుమానంతో తాగి వచ్చిన నూకరాజు తీవ్రంగా వేధించేవాడు. తిట్టడం, కొట్టడం నిత్యకృత్యంగా సాగుతుండేది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+