వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజీనామా వద్దు: మంత్రి శ్రీధర్‌ బాబుకు డిఎస్ సలహా

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : మంత్రి శ్రీధర్ బాబు రాజీనామా నిర్ణయాన్ని అభినందిస్తున్నానని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో శ్రీధర్ బాబు రాజీనామా నిర్ణయాన్ని మార్చుకోవాలని పిసిసి మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ డి. శ్రీనివాస్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీధర్‌బాబు శాఖను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మార్చడం సరికాదని అభిప్రాయపడ్డారు.

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అధిష్టానం విధేయుడననే అర్హత కోల్పోయారని ఆయన అన్నారు. ఈ నెల 23 తర్వాత ముఖ్యమంత్రి కాంగ్రెస్‌లోనే ఉంటే 2014 సాధారణ ఎన్నికలు జరిగే వరకు ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని డీఎస్ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ నేతలు సయంమనం పాటించడం మంచిదని ఆయన సూచించారు.

D Srinivas

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీపై చాలా మంది ఇటలీ వనిత అని, విదేశీయురాలని చాలా రకాలుగా విమర్శించారని డి. శ్రీనివాస్ అన్నారు. ఆమెకు భారతీయ సంస్కృతి తెలియదని, ఆమెకు ఏమీ అర్థంకాదని హాస్యాస్పదంగా విమర్శించారని ఆయన అన్నారు. ఆమెపై విమర్శలు చేయడం సరి కాదని ఆయన అన్నారు.

పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో, మత సామరస్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఆమె పదవులు వదులుకున్నారని డీఎస్ అన్నారు. 1999లో కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నకర దిశలో ఉండగా సోనియా కృషివల్లే 2004లో అధికారంలోకి వచ్చిందని శ్రీనివాస్ కొనియాడారు. అలాంటిది ఆమెను విమర్శించడం సరికాదని డీఎస్ అన్నారు.

English summary
PCC former president from Telangana region D Srinivas has suggested minister Sridhar Babu not to resign at present conditions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X