మమ్మల్ని అమ్మి: అక్బర్ డెవలప్‌పై దూళిపాళ్ల కౌంటర్
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదు నిజాం కాలంలోనే అభివృద్ధి చెందిందన్న మజ్లిస్ పార్టీ శాసన సభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీకి సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ నేత దూళిపాళ్ల నరేంద్ర కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ముసాయిదా బిల్లు పైన సోమవారం అసెంబ్లీలో అక్బరుద్దీన్ మాట్లాడారు. ఈ సమయంలో ఆయన నిజాం చేసిన అభివృద్ధిపై మాట్లాడారు. దీనిపై దూళిపాళ్ల స్పందించారు.
నిజాంపై మజ్లిస్ పార్టీకి, తెరాసకు ప్రేమ ఉంటే తమకు అభ్యంతరం లేదని, నిజాం పాలనను ఎందుకు పొగుడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. నిజాం నవాబు సీడెడ్ జిల్లాలను బ్రిటిష్ వాళ్లకు అమ్మలేదా అని ప్రశ్నించారు. హైదరాబాద్ అభివృద్ధికి నిధులు ఎక్కడి నుండి వచ్చాయో చెప్పాలన్నారు.

ఆంధ్ర ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్లకు అమ్మి అభివృద్ధి చేశారన్నారు. ఆంధ్రా ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్లు అభివృద్ధి చేశారని, వాళ్లను పొగడమంటారా అన్నారు. భూస్వామ్య వర్గాల చేతిలో చనిపోయిన పేద ముస్లింల గురించి మాట్లాడేందుకు ఎందుకు హృదయం రాలేదన్నారు. నీతికి, నిజాయితీకి మారుపేరైన స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరును ప్రస్తావించే హక్కు వేరే వాళ్లకు లేదన్నారు. నిజాం పాలనను గొప్పదని ఎందుకు చెబుతున్నారో అర్థం కావట్లేదన్నారు.
మంచి ఎంతో చెడు రెట్టింపు: గండ్ర
హైదరాబాదును తామే అభివృద్ధి చేశామని చెప్పడం సరికాదని, నిజాం పాలనలో మంచి ఎంతుందో, చెడు అంతకు రెట్టింపు ఉన్నదని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి అన్నారు.
సున్నిత అంశం: శైలజానాథ్
రాష్ట్ర విభజన అంశం చాలా సున్నితమైనదని, దీనిపై వాస్తవాలు మాట్లాడాలని శైలజానాథ్ అన్నారు. వాస్తవమైన చర్చలకు అవకాశం కల్పించాలనేది తమ యోచన అన్నారు. చరిత్రలోని వాస్తవాలు వెల్లడించాలని, హైదరాబాదుకు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన పన్నులు ఉన్నాయని చరిత్ర చెబుతోందన్నారు.
సభ వాయిదా
శాసన సభ మంగళవారానికి వాయిదా పడింది. శాసన సభ ఆవరణలో అంబేడ్కర్ విగ్రహావిష్కరణ ఉన్న నేపథ్యంలో సభను వాయిదా వేశారు.
అంబేడ్కర్ విగ్రహావిష్కరణ
శాసన సభ ఆవరణలో గవర్నర్ నరసింహన్ సోమవారం సాయంత్రం రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ుప ముఖ్యమంత్రి దామోదర రాజర్సింహ, సభాపతి నాదెండ్ల మనోహర్, ఉప సభాపతి మల్లు భట్టి విక్రమార్క, మండలి చైర్మన్ చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications