Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

విజయదశమి సస్పెన్స్, దీపావళి ఆ రోజే - వేద పండిత సభ స్పష్టత..!!

దసరా వేడుకలు మొదలయ్యాయి. ఈ సారి విజయదశమి పండుగ ఎప్పుడు చేసుకోవాలనే దాని పైన కొంత కాలంగా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వాలు సైతం సెలవులను మారుస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ నెల 23, 24 తేదీల్లో విజయదశమి ఎప్పుడు జరుపుకోవాలనేది ఇంకా చర్చగానే ఉంది. ఈ సమయంలోనే వేద పండితులు ఒక వేదికపై కలిసి చర్చించి అక్టోబర్‌ 23న తేది సోమవారం దసరా పండగను నిర్వహించుకోవాలని ప్రజలను కోరారు.

23,24 తేదీల్లో దసరా ఎప్పుడు : కొంత కాలంగా ప్రధాన పండుగల నిర్వహణలో ధర్మ సందేహాలు నెలకొంటున్నాయి. ఏ పండగ ఎప్పుడు చేసుకోవాలన్న అంశంపై పండితులు కూడా రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఏడాది పలు పండగ తేదీలపైనా ఇలాంటి సందేహాలే వ్యక్తమయ్యాయి. ఇప్పుడు విజయ దశమి (దసరా) పండగ విషయంలో ఇదే సందిగ్దత నెలకొంది. కొంత మంది ఈ నెల 23న అంటే.. మరికొందరు మాత్రం ఈ నెల 24న పండగ అంటున్నారు. మైసూరులో ఈ నెల 24వ తేదీ వరకు దసరా ఉత్సవాలు జరగనున్నాయి. విజయవాడలో 23వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. 23, 24 తేదీల్లో విజయదశమి ఎప్పుడు జరుపుకోవాలనే అంశం పైన వేద పండిత సభ స్పష్టత ఇచ్చింది. 23న తేది సోమవారం దసరా పండగను నిర్వహించుకోవాలని సూచించింది.

Dussehra 2023: When to Celebrate in Dussehra in Telugu states, Navarati Significance

వేద పండితుల స్పష్టత : సోమవారం మధ్యాహ్నం నుండి దశమి తిథితో పాటు శ్రవణ నక్షత్రం సోమవారమే ఉండటంతో 23వ తేదినే దసరా పండగను నిర్వహించుకోవాలన్నారు. అదే రోజు సాయంత్రం శమీ దర్శనం చేసుకోవాలని ప్రజలును కోరారు. పండితులు చేసిన ఈ నిర్ణయంపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయంలో ఎంతో మంది ఎన్నో సందేహాలున్నాయి. దశమి రోజున సాయంత్రం శ్రవణ నక్షత్రం ప్రామాణికం. కానీ ఈ సారి విజయ దశమి అక్టోబర్‌ 24న రోజున.. శ్రవణ నక్షత్రం లేదు. ధనిష్ట ఉంది. అటు 23 సాయంత్రం దసరా, శ్రవణ నక్షత్రం ఉంది. దాన్నే పండితులు ప్రామాణికంగా తీసుకున్నారు. దీంతో, ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

దీపావళి పైనా క్లారిటీ : అటు దీపావళి పండగకు కూడా బహుళ చతుర్ధశి, అర్దరాత్రి అమావాస్య ప్రామాణికం. ఈ సారి నవంబర్‌ 12 ఆదివారం చతుర్ధశి మధ్యాహ్నం 1.53 నిమిషాల వరకు ఉంది. రాత్రి అమావాస్య కాబట్టి అదే రోజు దీపావళి. ఈ సారి మహాశివరాత్రి పండగ మార్చి 8న ప్రామాణికం. అటు ఉగాదికి ఉదయం రోజు పాడ్యమినీ, ఆ రోజునే ఉగాది పండగను జరుపుకోవాలని ధర్మ సింధువు చెబుతోంది. అదే అంశాన్ని నిర్ణయ సింధువు కూడా ఘోషిస్తోంది. మొత్తంగా ఒక్కో పండగకు తిథి అనేది ఒక్కో రకంగా ప్రామాణికంగా వస్తూ వస్తోంది. దీంతో 12వ తేదనే దీపావళి పండుగల నిర్వహణ పైన వేడ పండితులు స్పష్టత ఇస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+