సీఎం అయ్యే ఛాన్స్ వదిలేసుకున్న చిరంజీవి!
వైసిపి బహిష్కృత నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చిరంజీవి రాజకీయాల పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల విభజనకు ముందు 2009ఎన్నికల సమయంలో పరిస్థితులపైన మాట్లాడుతూ చిరంజీవి పార్టీ గురించి కీలక విషయాలు చెప్పారు. ప్రస్తుతం ఆయన మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. దువ్వాడ శ్రీనివాస్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దివ్వెల మాధురికి షాక్ ఇచ్చాయి.
చిరంజీవిది గొప్ప వ్యక్తిత్వం
తాను ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేయడం, మెగాస్టార్ చిరంజీవి తో ఉన్న అనుబంధం గురించి వెల్లడించిన ఆయన రాజకీయాలలో చిరంజీవి ఔదార్యం గురించి చెప్పారు.రాజకీయాలలో తాను పోటీ చేసి ఓడిపోయానని, చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని గుర్తించిన చిరంజీవి తనకు డబ్బులు పంపించారని చాలా గొప్ప వ్యక్తిత్వం చిరంజీవి దని దువ్వాడ శ్రీనివాస్ తెలిపారు.

చిరంజీవి గురించి వాళ్లకు తెలుసు
2009 ఎన్నికల తర్వాత పరిస్థితిని వివరించిన ఆయన చిరంజీవి గారి గురించి కళా వెంకట్రావుకు, గంటా శ్రీనివాస్ కు కూడా తెలుసని, వాళ్ల ద్వారానే తనకు ఆయన డబ్బులు పంపించారని గుర్తు చేసుకున్నారు.ప్రజారాజ్యం పార్టీ విలీన సమయంలో తనకు కబురు పెట్టిన చిరంజీవి పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయొద్దని తాను కోరుతున్నానని, అయినా అప్పుడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని విలీనం చేశారని పేర్కొన్నారు.
చిరంజీవి సీఎం అయ్యేవారు
తాను చిరంజీవికి చెప్పే నాటికే ప్రజారాజ్యం పార్టీ విలీన ప్రక్రియ పైన చర్చలు ముగిశాయని దువ్వాడ శ్రీనివాస్ తెలిపారు. ప్రజారాజ్యం పార్టీని విలీనం చేయకుండా చిరంజీవి అప్పుడు రాజకీయాలలో కొనసాగి ఉంటే రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత చిరంజీవి కచ్చితంగా సీఎం అయ్యేవారని దువ్వాడ శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
చిరంజీవిని రాజకీయాల్లో ఎవరూ మర్చిపోలేరు
తన పార్టీలో పనిచేసిన నాయకులకు ఆయన ఇచ్చిన గౌరవం, స్వేచ్ఛ, వారిపైన ఆయన పెట్టుకున్న నమ్మకం, వారి అవసరాలను అర్థం చేసుకొని లీడర్ గా ఆయన అందించిన సహాయం ఎప్పుడు ఎవరు మరిచిపోలేరు అని దువ్వాడ శ్రీనివాస్ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికి కూడా తనకు వైయస్ రాజశేఖర్ రెడ్డి, వైయస్ జగన్మోహన్ రెడ్డి, అలాగే చిరంజీవి అంటే చాలా ఇష్టమని పేర్కొన్నారు












Click it and Unblock the Notifications