నాగబాబుకు మంత్రి పదవి దక్కేదెప్పుడు - తేల్చేసిన పవన్..!!
మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి అవ్వటం పై పవన్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. అల్లు అర్జున్ ఎపిసోడ్ పైన తొలిసారి స్పందించిన పవన్ అనేక అంశాలను ప్రస్తావించారు. అల్లు అర్జున్ ను ఒంటరి చేసారని.. గొటితో పోయే దానిని గొడ్డలి వరకు తెచ్చుకున్నారని వ్యాఖ్యానించారు. రేవంత్ సినీ ఇండస్ట్రీకి ఇస్తున్న మద్దతును పవన్ ప్రశంసించారు. రేవంత్ కాబట్టే హీరోను అరెస్ట్ చేయగలి గారని చెప్పుకొచ్చారు. రెండో రోజే బాధిత కుటుంబాన్ని పరామర్శించాల్సి ఉందన్నారు. తన జిల్లా ల పర్యటన పైన పవన్ క్లారిటీ ఇచ్చారు.
మంత్రిగా నాగబాబు
నాగబాబు ను మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు రాజ్యసభ అభ్యర్ధుల ఖరారు వేళ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. అయితే, ఎప్పుడు మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే చర్చ రాజకీయం గా కొనసాగుతోంది. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ ఈ అంశం పైన ఆసక్తి కర అంశాలను వెల్లడిం చారు. తాను కులం చూసి నేను మనుషులను ఎంచుకోలేదని .. కులాలను చూసి పదవులు ఇవ్వ డం లేదని చెప్పుకొచ్చారు. తనతో కలిసి పార్టీ కోసం పని చేసిన వారిని నేను చూసుకోవాల్సిన బాధ్య త ఉందని చెప్పారు. తన కోసం, తనతో పని చేసిన వాళ్ళను గుర్తించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తాము గతంలోనే నాగబాబుకు రాజ్యసభ ఇవ్వాలని భావించామని వెల్లడించారు.

నాగబాబు త్యాగం చేసారు
కానీ, కొన్నిప్రాధాన్యత లు .. రాజకీయ కారణాలతో రాజ్యసభ పదవిని త్యాగం చేయాల్సి వచ్చిందని పవన్ వివరించారు. నాగబాబుకు ఎంఎల్సీ పదవి ఇచ్చకే మంత్రి వర్గంలోకి తీసుకోవాలని భావిస్తు న్నట్లు చెప్పుకొచ్చారు. జనసేన ఇప్పుడే బలపడుతున్న పార్టీగా అనుకోవాలన్నారు. నాగబాబు విషయంలో అడుగుతారని.. జగన్ విషయంలో ఎవరూ అడగరని వ్యాఖ్యానించారు. నాగబాబు కు పదవి ఇవ్వడం వారసత్వ రాజకీయాలు అని అనుకోవడం తప్పని పవన్ పేర్కొన్నారు. పార్టీ కోసం నాగబాబు ఎంతో కాలంగా కష్ట పడుతున్నారని పవన్ ప్రశంసించారు. నాగబాబు ను ఎంఎల్సీ గా ఎంపిక చేసిన తరువాత మంత్రిని చేసే విషయం ఆలోచిస్తామని పవన్ తేల్చి చెప్పారు.
మంత్రి అయ్యేది అప్పుడే
దీంతో, నాగబాబుకు ఇప్పట్లో మంత్రి పదవికి ఛాన్స్ లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రస్తు తం నలుగురు వైసీపీ ఎమ్మెల్సీలు తమ పదవులకు రాజీనామా చేసారు. వీటి ఆమోదం పైన మండ లి ఛైర్మన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అదే విధంగా వచ్చే మార్చికి మరో నలుగురు ప్రస్తుత సభ్యుల పదవీ కాలం ముగియనుంది. ఇప్పుడు రాజీనామాలు ఛైర్మన్ ఆమోదించినా.. ఆ స్థానాల్లో ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. దీంతో, కొత్తగానే నాగబాబును ఎమ్మెల్సీగా చేయాలనేది కూటమి నేతల ఆలోచనగా తెలుస్తోంది. దీంతో, వచ్చే మార్చి తరువాతనే నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉందని కూటమి నేతల అంచనా.












Click it and Unblock the Notifications