ఏడాదిలో పవన్ కు అదొక్కటే రిలీఫ్ - మారుతున్న లెక్కలు..!!
ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసు కొంటోంది. అయితే, క్షేత్ర స్థాయిలో మాత్రం కూటమికి పరిస్థితులు మారుతున్నాయి. మూడు పార్టీ లు అప్రమత్తం అయ్యాయి. పవన్ రాజకీయంగా పట్టు కోల్పోతున్నారనే విశ్లేషణలు వస్తున్నాయి. కాగా, పవన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల విషయంలో పట్టించుకోవటం లేదనే వాదన బలంగా ఉన్నట్లు సర్వే సంస్థలు వెల్లడిస్తున్నాయి. అయితే, పవన్ తాను వ్యక్తిగతంగా ఇచ్చిన హామీలు అమలు చేస్తుండటం ఒక్కటే రిలీఫ్ గా కనిపిస్తోంది.
పట్టు జారుతోంది
2024 ఎన్నికల సమయంలో బలంగా కనిపించిన పవన్.. అదే విధంగా ఫలితాలు సాధించారు. కూటమి విజయం పవన్ కీలకంగా వ్యవహరించారు. తన పార్టీ నుంచి పోటీ చేసిన అందరినీ పవన్ గెలిపించుకున్నారు. అయితే, పాలన ఏడాది పూర్తవుతున్న వేళ మాత్రం పరిస్థితుల్లో మార్పు కనిప స్తోంది. సర్వే సంస్థల ఏడాది పాలన ఫలితాలు కూటమి పార్టీల నేతలకు అలర్ట్స్ గా మారాయి. ఈ సమయంలో ప్రత్యేకించి పవన్ ఏడాది పాత్ర పైన చర్చలు జరుగుతున్నాయి. ఎన్నికల సమయం లో పవన్ ఇచ్చిన హామీల అమలు.. వరుసగా రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాల పైన స్పందిస్తున్న తీరు పైన ప్రజల్లో సానుకూలత లేదని సర్వే సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. ఇక.. పవన్ పార్టీ బలోపేతం కోసం సరైన నిర్ణయాలు లేవనే వాదన ఉంది.

కీలక పరిణామాలు
ఏడాది కాలంగా రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాల్లో కొన్నిటి పైన పవన్ స్పందించిన తీరు ప్రజల్లో ఇమేజ్ పెంచింది. తిరుమల ఘటన.. శాంతి భద్రతల విషయంలో హోం మంత్రికి పిఠా పురం వేదిక చేసిన హెచ్చరిక పైన పవన్ స్పందన పైన సానుకూలత కనిపించింది. ఆ తరువాత అనేక పరిణామాలు చోటు చేసుకున్నా.. పవన్ ఆశించిన రీతిలో స్పందించ లేదనే అభిప్రాయం ఉన్నట్లు సర్వే నివేదికలు వెల్లడిస్తున్నాయి. నాడు ఎన్నికల సమయంలో పవన్ ఏం చెప్పారు..ఇక ఇప్పుడు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే, పవన్ వ్యక్తిగతంగా ఇచ్చిన హామీల విషయంలో మాత్రం మాట నిలబెట్టుకుంటున్నారు. ఇది మాత్రమే ప్రస్తుతం ఆశాజనంగా కనిపిస్తోంది. పిఠాపురంలోనూ భిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.
మాల నిలబెట్టుకుంటూ
ఏడాది కాలంలో పాలనా - రాజకీయంగా పవన్ ఆశించిన స్థాయిలో రాణించలేదనే అభిప్రాయం బలంగా ఉంది. వ్యక్తిగతంగా ఇచ్చిన హామీలను మాత్రం ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. తాజాగా నంద్యాల జిల్లా పరిధిలో ఉన్న నందికొట్కూరు నియోజకవర్గ, మండలంలో ఉన్న కొణిదెల గ్రామా న్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తన వంతు సహకారం అందిస్తానని పవన్ గతం లో ప్రకటించారు. ఇందు కోసం తన సొంత నిధుల నుంచి రూ.50 లక్షల చెక్కును జిల్లా కలెక్టర్ కు పంపారు. ఈ నిధులను గ్రామ అభివృద్ధి పనులకు వినియోగించాల్సిందిగా సూచించారు. తమ ఇంటి పేరు కలిగిన కొణిదెల గ్రామాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో పవన్ ఈ నిధులను అందించారు. పవన్ ఇదే విధంగా పాలనా పరంగా - పార్టీ విషయంలోనూ అవసరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications