భూ మాఫియాకు ఆ నేతల వత్తాసు, చర్యలు తీసుకోండి - చంద్రబాబుకు పవన్ ఫిర్యాదు..!!

భూ మాఫియా పై డిప్యూటీ సీఎం పవన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. గతంలో హైదరాబాద్‌లో ప్రజల విలువైన భూములను చెరపట్టిన ముఠాలు విశాఖలో దిగాయని పేర్కొన్నారు. విశాఖ సహా పలు ప్రాంతాల్లో భూ మాఫియాను కట్టడి చేయాలని..వారికి వత్తాసు పలుకుతున్న నేతల పై చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసారు. ఉత్తరాంధ్ర భూములను కాపాడాలని కోరారు.

రాష్ట్రంలో వివిధ ప్రాంతాలతో పాటు గతంలో హైదరాబాద్‌లో ప్రజల విలువైన భూములను చెరపట్టిన ముఠాలు విశాఖలో దిగాయని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. వెంటనే దృష్టిసారించి భూ మాఫియాను కట్టడి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. కలెక్టర్ల సదస్సులో రెవిన్యూ అంశాల పైన చర్చ సమయంలో పవన్ ఈ ప్రస్తావన చేసినట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్రలో భూ మాఫియా ఆగడాల గురించి పవన్‌ ప్రస్తావించారు.

Dy CM Pawan Kalyan complaint to CM Chandra Babu to take action on land grabbers in Visakha

ఉత్తరాంధ్ర జిల్లాలకు పెద్దఎత్తున పరిశ్రమలు, ఐటీ కంపెనీలు వస్తున్నాయని..వేగంగా అభివృద్ధి జరుగుతోందని చెప్పారు. దీంతో విశాఖ, విజయనగరం వంటి జిల్లాల్లో భూములకు భారీ ధరలు పెరిగాయని వివరించారు. ఇక్కడి భూములను చేజిక్కించుకోవాలని భూ మాఫియా ప్రయత్నిస్తోందని ప్రజలు చెబుతున్నారని పవన్ పేర్కొన్నారు. గతంలో హైదరాబాద్‌లో భూ మాఫియా రెచ్చిపోయిందని.. అక్కడి ముఠాలు కొన్ని ఇప్పుడు విశాఖ లో మకాం వేసి..భూ కబ్జాలకు ప్రయత్నిస్తున్నాయన్నారు.

ఈ దశలోనే ప్రభుత్వం స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని... భూ మాఫియాపై ఉక్కుపాదం మోపాలని చంద్రబాబును పవన్‌ కల్యాణ్‌ కోరినట్లు సమాచారం. దీనిపై సీఎం స్పందిస్తూ... భూ వివాదాలు, వ్యవహారాల్లో తాము, జనసేన, బీజేపీలు తలదూర్చవని స్పష్టత ఇచ్చారు. అదే సమయంలో భూ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని.. ఈ విషయంలో ఏ ఫిర్యాదు వచ్చినా వదలిపెట్టమని చెప్పారు. పాత రికార్డులను పరిశీలించి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

భూ వివాదాల్లో రాజకీయ పార్టీలు, వ్యక్తులు, ప్రొఫెషన ల్‌ లిటిగెంట్స్‌ తలదూర్చినా కఠిన చర్యలు ఉండాలిని సీఎం స్పష్టం చేశారు. చంద్రబాబు మాట్లాడి న తర్వాత ఇదే అంశాన్ని పవన్‌ మరోసారి ప్రస్తావించారు. ఉత్తరాంధ్రలోని భూములపై కొందరు నేతలు కన్నేశారని చెప్పారు. వారు కొత్తగా భూ వ్యవహారాల్లో తలదూర్చి వివాదాలను సృష్టిస్తున్నార ని తెలిపారు. విశాఖ జోన్‌లో ఈ వ్యవహా రాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పారు. భూ కబ్జా వ్యవహారాలపై కఠిన చర్యలు తీసుకొనేలా గట్టి ఆదేశాలు ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరగా.. చంద్రబాబు స్పందిస్తూ అధికారుల కు ఆదేశాలు ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+