Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇక అలా పిలవద్దు, అతిక్రమించను - పవన్ కీలక నిర్ణయం..!!

డిప్యూటీ సీఎం పవన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధికారులకు స్పష్టత ఇచ్చారు.
ఉగ్రదాడి మృతులకు పవన్‌ కల్యాణ్‌, అధికారులు సంతాపం తెలిపారు. అధికారులు, ఉద్యోగుల సహకారంతో అనతికాలంలోనే వేల కిలోమీటర్ల మేర రహదారులు నిర్మించినట్లు వివరించారు. అదే సమయంలో తన శాఖ అధికారులకు మార్గనిర్దేశం చేసారు. ఇప్పుడు పవన్ తీసుకున్న నిర్ణయం ప్రభుత్వ వర్గాల్లో ఆసక్తి కరంగా మారుతోంది.

బలోపేతం చేస్తాం
పంచాయతీరాజ్‌ దినోత్సవ వేడుకల్లో పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలు వెల్లడించారు. గ్రామాలు స్వయంప్రతిపత్తి వ్యవస్థలుగా ఎదగాలని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆకాంక్షించారు. పంచాయ తీల నిధులు వాటికే ఖర్చు చేయాలని అధికారులకు చెప్పినట్లు పవన్‌ తెలిపారు. అధికారులు, ఉద్యోగుల సహకారంతో అనతికాలంలోనే వేల కిలోమీటర్ల మేర రహదారులు నిర్మించినట్లు వివరించారు. పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేయాలనే చిత్తశుద్ధితో పనిచేసినట్లు పవన్‌ తెలిపారు. డబ్బులు, సిఫార్సులు లేకుండా పంచాయతీరాజ్‌లో బదిలీల ప్రక్రియ చేశామన్నారు. పార్టీలకు అతీతంగా గ్రామాలకు నిధులు ఇచ్చినట్లు వెల్లడించారు.

dy-cm-pawan-kalyan-latest-directions-for-govt-officials-details-here

జాప్యం వాస్తవమే
ప్రభుత్వంపై నమ్మకం ఉంచి పనులు నిర్వహించిన గుత్తేదార్లకు ధన్యవాదాలు తెలిపారు. కేంద్రం నుంచి నిధుల విడుదలలో జాప్యం జరిగిన మాట వాస్తవమని అన్నారు. అతి త్వరలోనే నిధులు వస్తాయని తనకు సమాచారం వచ్చిందన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు గత ప్రభుత్వం పంచాయితీలకు ఇవ్వలేదని, కూటమి రాగానే వెయ్యి కోట్లకు పైగా ఆర్థికసంఘం నిధులు విడు దల చేశామని పవన్ గుర్తు చేశారు. గ్రామాభివృద్ధి ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నా మని వివరించారు. రూల్స్ బుక్‌ను ఎప్పటికీ అతిక్రమించి పనిచేయనని పవన్ కల్యాణ్​ పేర్కొన్నారు.

ఆ పదం వాడవద్దు
పార్టీలకు అతీతంగా గ్రామాలకు నిధులు ఇచ్చామని, గ్రామాలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. గత ప్రభుత్వం వల్ల గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్న పవన్, కూటమి ప్రభుత్వంలో ఉపాధి హామీ పథకంలో 75 లక్షలకు పైగా శ్రామికులకు నిధులు ఇచ్చామని గుర్తు చేశారు. ఉపాధి హామీ కూలీ అనే పదం వాడొద్దని, కూలీకి బదులుగా గ్రామీణ వికాస శ్రామికుడు అనే పదం ఉపయోగించాలని సూచించారు. పవన్ కాశ్మీర్ ఉగ్రదాడిలో మరణించిన ఏపీ వాసుల కుటుంబ సభ్యులను పరామర్శించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+