అకీరాతో కలిసి పవన్ ఆలయాల సందర్శన వెనుక..!!

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆలయాల సందర్శన ఆసక్తి కరంగా మారుతోంది. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని చారిత్రాత్మక ఆలయాలను పవన్ సందర్శిస్తున్నారు. బీజేపీ ప్రణాళికల్లో భాగంగా నే పవన్ యాత్ర కొనసాగుతోందనే వాదన తెర మీదకు వచ్చింది. అయితే, ఈ యాత్ర పూర్తిగా తన వ్యక్తగతమని పవన్ స్పష్టం చేసారు. ఈ యాత్రలో పవన్ తో పాటుగా ఆయన కుమారుడు అకీరా ఉండటం మరింత ఆసక్తి కరంగా మారింది. అసలు కారణమేంటనే చర్చ మొదలైంది.

పవన్ యాత్ర వెనుక
పవన్ కల్యాణ్ దక్షిణాది రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక యాత్ర కొనసాగిస్తున్నారు. కేరళ, తమిళనాడు రాష్ట్రా ల్లోని ప్రముఖ ఆలయాలను ఆయన సందర్శిస్తున్నారు. కేరళ కొచ్చి సమీపంలోని అగస్త్య మహర్షి ఆలయానికి వెళ్లి పూజలు చేసిన పవన్.. రెండో రోజు యాత్రలో భాగంగా స్వామి మలై శ్రీ స్వామినాథ స్వామి వారిని దర్శించుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. పవన్‌ కల్యాణ్‌ వెంట ఆయన కుమారుడు అకీరా నందన్‌ , టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద్‌సాయి ఉన్నారు. నాలుగు రోజుల ఈ పర్యటనలో ఆయన అనంత పద్మనాభ స్వామి, మధుర మీనాక్షి, శ్రీ పరస రామస్వామి, తిరుత్తై సుబ్రమణ్యేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

DY CM Pawan Kalyan southern Temples yatra continues along with his Son Akira goes viral

అకీరాతో కలిసి
ఇక, ఈ రోజు పవన్ తమిళనాడు తంజావూరు చేరుకున్నారు. కుంభకోణం సమీపంలో ఉన్న స్వామి మలై మురుగన్ స్వామిని దర్శించుకున్నారు. పవన్ కళ్యాణ్ తో పాటూ తనయుడు అకీరానందన్ కూడా స్వామిని దర్శించుకున్నాడు. ప్రసిద్ధ ద్రావిడ వాస్తుశైలి నిర్మాణంలో ఉండే ఈ ఆలయానికి చారిత్రక ప్రాముఖ్యత ఉంది. షష్ట షణ్ముఖ క్షేత్ర యాత్రకు శ్రీకారం చుట్టిన పవన్.. కంద షష్టి కవచ పారాయణంలో పాల్గొన్నారు. అక్కడ కొలువైన శ్రీ స్వామినాథ స్వామి వారిని దర్శించుకున్నారు.
ఆలయ అర్చకులు శ్రీ కన్నన్ గురుకల్... సంప్రదాయబద్ధంగా పూజలు చేశారు. పంచ హారతులతో హారతి ఇచ్చారు.

ప్రత్యేక పూజల్లో
పవన్ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి ధ్వజస్థంభానికి మొక్కారు. స్వామినాథ స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన కంద షష్టి కవచ పారాయణంలో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన కుమారుడు అకీరా నందన్ ఈ ఆలయాల యాత్రకు రావటం వెనుక కారణాల పైన ఆసక్తి కర చర్చ సాగుతోంది. తిరుమల, ఆ తరువాత ఇంద్రకీలాద్రి దర్శనానికి తన కుమార్తెలతో వచ్చిన పవన్.. ఇప్పుడు ఈ ఆలయాల సందర్శన కోసం కుమారుడిని తీసుకొచ్చారు. పవన్ తో పాటుగా అకీరా సైతం పూజల్లో పాల్గొంటున్నారు. నాలుగేళ్ల క్రితమే ఈ ఆలయాలకు రావాల్సి ఉందని పవన్ పేర్కొన్నారు. దీని ద్వారా ఆధ్యాత్మికతను బలంగా విశ్వసించే పవన్.. ఆ యాత్రల నిర్వహణ వెనుక బలమైన కారణం ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+