సొంత పార్టీలో ఆ ఎమ్మెల్యేలపై పవన్ సీరియస్ - సంచలన నిర్ణయం..!!

ఏపీలో రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటోంది. మూడు పార్టీలు ఇదే సమయంలో సొంతంగా తమ బలం పెంచుకోవటం పైన ఫోకస్ చేసాయి. టీడీపీ మహానాడు ద్వారా పార్టీలో జోష్ పెంచే ప్రయత్నం చేస్తోంది. బీజేపీ కూటమి పైన పట్టు బిగించింది. తమ నేతలకు పదవులు ఇప్పించుకోవటం లో మాట నెగ్గించుకుంటోంది. ఇక, పవన్.. పార్టీ పరంగా ఎలాంటి ప్రధాన నిర్ణయాలు లేవు. ఇప్పుడు సొంత పార్టీలోని కొందరు ఎమ్మెల్యేల పైన వస్తున్న ఆరోపణలు... పని తీరు పైన పవన్ సీరియస్ గా ఉన్నారు. దీంతో, సంచలన నిర్ణయం తీసుకున్నారు.

పవన్ కీలక నిర్ణయం
2024 ఎన్నికల్లో కూటమి పార్టీలు ఏకంగా 164 సీట్లు దక్కించుకున్నాయి. జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. అయితే, ఏడాది కాలంలోనే పరిస్థితుల్లో మార్పు కనిపి స్తోంది. అవినీతి పెరిగిందనే ఆరోపణలు తారా స్థాయికి చేరాయి. ఎమ్మెల్యేలు అవినీతిలో భాగ స్వాములు అవుతున్నారంటూ పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. కూటమికి పట్టం కట్టిన గోదావరి జిల్లాల్లో ఈ చర్చ ఎక్కువగా వినిపిస్తోంది. జనసేన ఎమ్మెల్యేల పైన ఆరోపణలు వస్తున్నాయి. దీంతో, పవన్ ఈ వ్యవహారం లో ఎమ్మెల్యేలు ఎవరెవరు ఉన్నారనే కోణంలో ఆరా తీసినట్లు విశ్వస నీయ సమాచారం. అదే విధంగా ఏడాది కాలంలో వారి పని తీరుతో పాటుగా ఈ ఆరోపణల పైన పవన్ పూర్తి నివేదిక సిద్దం చేస్తున్నారు.

dy-cm-pawan-seek-reports-on-janasena-mlas-performance-and-corruption-allegations

ఎమ్మెల్యేల పై సీరియస్
జనసేన ఎమ్మెల్యేలు కొందరి పైన వస్తున్న ఆరోపణల పై పవన్ సీరియస్ గా ఉన్నట్లు పార్టీ నేతల సమాచారం. దీంతో, జనసేన ఎమ్మెల్యేల పనితీరు.. వ్యవహార శైలి పై పవన్ ప్రత్యేక సర్వే చేయిం చాలని నిర్ణయించారు. ఇప్పటికే ప్రాధమిక సమాచారం సేకరించారు. జనసేన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో వారి కుటుంబ సభ్యుల జోక్యం.. ఇసుక, మద్యం లావాదేవీల్లో ప్రమేయం వంటి అంశాల పైన పూర్తి సమాచారంతో నివేదికలను ప్రముఖ సర్వే సంస్థ నుంచి సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో జనసేన ఎమ్మెల్యేల పైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. దీంతో, పవన్ అలర్ట్ అయ్యారు. ఆ సర్వే సంస్థ ఇచ్చిన నివేదిక ఆధారంగా జూన్ మూడో వారం లో పార్టీ ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశానికి పవన్ నిర్ణయించినట్లు సమాచారం. అవినీతి.. బంధు ప్రీతి ఆరోపణలు ఉన్న ఎమ్మెల్యేల పైన కఠిన చర్యల దిశగా పవన్ సిద్దం అవుతున్నట్లు పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. దీంతో, పవన్ నిర్ణయాలు ఏంటనేది ఆసక్తిగా మారుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+