ఏపీలో భూకంపం.. ప్రజల ఆందోళన, ఏపీకి భూకంప ముప్పు ఉందా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూ ప్రకంపనలు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. పల్నాడు జిల్లాలో నేడు తెల్లవారుజామున భూకంపం సంభవించింది. ఈ భూకంపం రిక్టర్ స్కేలు పైన 3.5 తీవ్రతగా నమోదయింది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ నిర్ధారించింది. వినుకొండకు 20 కిలోమీటర్ల దూరంలో భూ ఉపరితలానికి పది కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టుగా నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ గుర్తించింది.
తెల్లవారుజామున ఏపీలో భూ ప్రకంపనలు
తెల్లవారుజామున 2 గంటల 33 నిమిషాలకు ఈ భూకంపం ప్రకంపనలు చోటుచేసుకున్నాయని పేర్కొంది. ఈ భూకంప ప్రభావంతో వినుకొండ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో భూమి కనిపించింది. వినుకొండతో పాటు దర్శి చుట్టుపక్కల ప్రాంతాలలో భూమి కంపించడంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే స్వల్ప ప్రకంపనలు రావడం వల్ల అక్కడ ఎటువంటి ప్రాణనష్టం కానీ, ఆస్తి నష్టం కానీ చోటు చేసుకోలేదు.

ఏపీకి భూకంపాల ముప్పు ఉందా?
అయితే రానున్న రోజులలో ఈ ప్రాంతంలో మరిన్ని భూప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక తాజాగా భూకంపం రావడంతో ఏపీకి భూకంపాల ముప్పు ఉందా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భూకంపాల పరంగా తక్కువ నుంచి మోస్తారు ప్రమాద ప్రాంతం ఉందని పరిగణించబడింది. అయితే ఇది ప్రాణ నష్టం జరిగేంత తీవ్ర స్థాయిలో ఉండకపోవచ్చు అన్న అంచనా ఉంది.
ఏపీ భూకంపాల దృష్ట్యా ఆ జోన్స్ లో
భారతదేశంలో భూకంప జోన్లను విభజించిన క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భూకంప తీవ్రత దృష్ట్యా జోన్ 2 లోను, జోన్ 3 లోను ఉన్నట్టుగా పేర్కొంది. అంటే తక్కువ ప్రమాదం, మోస్తరు ప్రమాదం ఉన్న ప్రాంతాలుగా ఏపీని భూకంపం దృష్ట్యా విభజించినట్టు సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది.
ఈ ప్రాంతాలలోనే భూకంపం వచ్చే చాన్స్
సహజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూకంపాలు చాలా అరుదుగా వస్తాయి. కొన్ని ప్రాంతాలలోనే స్వల్ప ప్రకంపనలు అప్పుడప్పుడు నమోదవుతాయి. ముఖ్యంగా తీర ప్రాంతాలలోనూ, రాయలసీమలోని కొన్ని భాగాలలోనూ స్వల్ప స్థాయిలో భూకంపాలు నమోదు అయ్యే అవకాశం ఉంది. అయితే ఏపీకి ప్రస్తుతం భూకంపాలతో వచ్చే ప్రమాదమేమీ లేదని సిస్మాలజీ లెక్కలు చెప్తున్నాయి.
-
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
చరిత్ర సృష్టించిన భారత ఆయిల్ ట్యాంకర్ 'జగ్ విక్రమ్'.. 20 వేల టన్నుల LPGతో హార్మూజ్ ను దాటి..











Click it and Unblock the Notifications